Titanic actor David Warner: క్యాన్సర్‌తో నటుడి మృతి

ABN , First Publish Date - 2022-07-26T17:40:26+05:30 IST

షేక్‌స్పియర్ విషాదాల నుంచి సైన్స్ ఫిక్షన్ కల్ట్ క్లాసిక్‌ల వరకు అనేక పాత్రలు పోషించి మెప్పించిన బ్రిటీష్ నటుడు డేవిడ్ వార్నర్..

Titanic actor David Warner: క్యాన్సర్‌తో నటుడి మృతి

షేక్‌స్పియర్ విషాదాల నుంచి సైన్స్ ఫిక్షన్ కల్ట్ క్లాసిక్‌ల వరకు అనేక పాత్రలు పోషించి మెప్పించిన బ్రిటీష్ నటుడు డేవిడ్ వార్నర్ (David Warner) 80 ఏళ్ల వయస్సులో మరణించారు. లండన్‌లోని ఎంటర్‌టైనర్‌ల రిటైర్‌మెంట్ హోమ్ అయిన డెన్‌విల్లే హాల్‌లో ఆదివారం క్యాన్సర్ సంబంధిత అనారోగ్యంతో మరణించినట్లు వార్నర్ కుటుంబం తెలిపింది.


హాలీవుడ్‌లో 1971 సైకలాజికల్ థ్రిల్లర్ ‘స్ట్రా డాగ్స్’, 1976 హారర్ క్లాసిక్ ‘ది ఒమెన్’, 1979 టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ ‘టైమ్ ఆఫ్టర్ టైమ్’ వంటి చిత్రాలలో విలన్‌గా నటించి డేవిడ్ వార్నర్ మంచి గుర్తింపు సాధించాడు. జేమ్స్ కామెరూన్ 1997 బ్లాక్‌బస్టర్ ‘టైటానిక్‌ (Titanic)’లో చేసి వాలెట్ స్పైసర్ లవ్‌జోయ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌లో శిక్షణ పొందిన వార్నర్.. కింగ్ హెన్రీ VI, కింగ్ రిచర్డ్ II వంటి పాత్రలను పోషించి, రాయల్ షేక్స్‌పియర్ కంపెనీకి యువ స్టార్ అయ్యాడు. కాగా.. ఆయన చివరిగా 2018లో విడుదలైన మేరీ పాపిన్స్ రిటర్న్స్‌లో రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ అడ్మిరల్ బూమ్ పాత్రలో నటించాడు.

Updated Date - 2022-07-26T17:40:26+05:30 IST