Annamayya controversy: శ్రావణ భార్గవిపై ఫిర్యాదు.. ముదురుతోన్న వివాదం!

ABN , First Publish Date - 2022-07-24T00:07:49+05:30 IST

అన్నమాచార్యుల పెదకుమారుడు పెద తిరుమలాచార్యులు రాసిన ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ కీర్తనతో గాయని శ్రావణ భార్గవి చిత్రీకరించిన వీడియో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే! దీనిపై అన్నమయ్య వంశస్థులు సహా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని అభ్యర్థించారు, మరికొందరు డిమాండ్‌ చేశారు.

Annamayya controversy: శ్రావణ భార్గవిపై ఫిర్యాదు.. ముదురుతోన్న వివాదం!

అన్నమయ్య వంశస్థులకు క్షమాపణ చెప్పాలి..

వీడియో తొలగించకపోతే తిరుపతిలో అడుగుపెట్టనివ్వం

మీ హావభావాల కోసం మరోపాట ఎంపిక చేసుకోవలసింది..

శ్రావణ భార్గవిపై పోలీసులకు ఫిర్యాదు

– తిరుపతి వాసులు

అన్నమాచార్యుల పెదకుమారుడు పెద తిరుమలాచార్యులు రాసిన ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ కీర్తనతో గాయని శ్రావణ భార్గవి(Shravana bhargavi) చిత్రీకరించిన వీడియో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే! దీనిపై అన్నమయ్య వంశస్థులు సహా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని అభ్యర్థించారు, మరికొందరు డిమాండ్‌ చేశారు. అయితే దానికి సమాధానంగా శ్రావణ భార్గవి ‘కష్టపడి చేసిన ఆ వీడియోను తొలగించేది లేదని, అది అశ్లీలం కాదని.. దీనిపై విమర్శలు మానుకోవాలని’ చెప్పినట్లుగా అన్నమయ్య వంశస్థులు మీడియాకి తెలియజేశారు. ఇది జరిగి రెండు రోజులు అయినా శ్రావణ భార్గవి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వివాదం మరింతగా ముదురుతూ వస్తోంది. ఇప్పటి వరకూ అన్నమయ్య వంశస్థులు, వారసులే దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు శ్రీవారి భక్తులు కూడా శ్రావణ భార్గవిపై ఫైర్ అవుతున్నారు. ఆమె తీరుపై తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య కీర్తనను అవమానపరిచి శ్రీవారి భక్తులను మనోభావాలను దెబ్బ తీశారంటూ తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో భక్తులు శ్రావణ భార్గవిపై ఫిర్యాదు చేశారు. త్వరలో ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆ వీడియోలోని శ్రావణ భార్గవి ఫొటో ఫ్లకార్డులను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. (Annamayya controversy)


‘‘తిరుమల శ్రీనివాసుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. అలాంటి స్వామి కీర్తనను ఆమెకు అన్వయించుకుని రకరకాల హావబావాలతో ఆ వీడియో చేసిన తీరు బాగోలేదు. ఆమె హావభావాలు బయటపెట్టుకోవాలంటే మరేదైనా పాటను సెలెక్ట్‌ చేసుకోవలసింది. శ్రీవారి కీర్తనను ఎందుకు అవమాన పరచడం? ఇది తప్పు అని ప్రశ్నించిన అన్నమాచార్యుల వంశస్థులతో అహంకారంగా మాట్లాడింది. మీ చూపే వక్రంగా ఉందని వారిని అవమానించింది. తిరుపతి చుట్టు పక్క ప్రాంతాల వారంతా అన్నమాచార్యుల వంశస్థులను ఎంతో గౌరవించుకుంటాం. వారిని అలా అవమానించడం కూడా తప్పే’’ అని తిరుమతికి చెందిన ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. (Tirupati people fire on shravana bhargavi)


‘‘ప్రముఖ గాయని ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మీ శ్రీవారి పాటలెన్నో పాడారు. ఆమెకు తిరుపతిలో శిలా విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించుకుంటున్నాం. ఇదే కీర్తనను సాటి సింగర్‌ గీతామాధురి ఎంతో చక్కగా పాడారు. శ్రావణ భార్గవిలా వక్రీకరించలేదు. యూట్యూబ్‌ నుంచి ఆ వీడియో తొలగించి, వేంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెబితేనే ఆమెను తిరుపతిలో అడుగుపెట్టనిస్తామనీ, వీలైనంత త్వరగా ఆ వీడియో తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’’ హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2022-07-24T00:07:49+05:30 IST