కంపెనీల ప్రకటనల్లో నటించడమే కాకుండా.. పెట్టుబడి పెట్టిన అందాల భామలు వీరే..

ABN , First Publish Date - 2022-03-14T16:39:02+05:30 IST

ఎంతోమంది సినీ ప్రముఖులు వివిధ కంపెనీల ప్రకటనల్లో నటించడం మామూలే. అలా యాడ్స్ చేయడం ద్వారా కోట్లు గడిస్తున్న తారలు ఉన్నారు...

కంపెనీల ప్రకటనల్లో నటించడమే కాకుండా.. పెట్టుబడి పెట్టిన అందాల భామలు వీరే..

ఎంతోమంది సినీ ప్రముఖులు వివిధ కంపెనీల ప్రకటనల్లో నటించడం మామూలే. అలా యాడ్స్ చేయడం ద్వారా కోట్లు గడిస్తున్న తారలు ఉన్నారు. అయితే ఆ కంపెనీల మీద నమ్మకంతో అందులో పెట్టుబడి పెట్టేది మాత్రం చాలా తక్కువమందేనని చెప్పాలి. అయితే ఇటీవలికాలంలో ఆ ట్రెండ్ పెరిగిపోయింది. ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ తాము అడ్వార్టైజ్ చేస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ తమ సంపాదనను ఎన్నో రెట్టు పెంచుకుంటున్నారు. ఆ తారల గురించి తెలుసుకుందాం రండి..


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనయురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సారా అలీఖాన్. అనంతరం సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన రేంజ్‌ని పెంచుకుంది. దీంతో ఎన్నో కంపెనీలు ఈ భామని తమ బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంచుకున్నాయి. అయితే అందులో సాధారణ దుస్తుల నుంచి పాప్ కల్చర్ దుస్తులను తయారు చేసే ‘ది సోల్డ్ స్టోర్‌’ అనే సంస్థ‌లో సారా పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారింది. దాని గురించి సారా మాట్లాడుతూ.. ‘పాప్ కల్చర్ ప్రేమికురాలిగా, అలాగే ఫ్యాషన్‌తో పాటు ఒరిజినాలిటీ, సౌలభ్యం ఉండడం కూడా ముఖ్యమని అనుకుంటున్నాను. అందుకే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాను’ అని చెప్పుకొచ్చింది.




నైకా అనే కంపెనీలో కత్రినా కైఫ్ రూ.2.02 కోట్లు, అలియా భట్ రూ.4.95 కోట్లు పెట్టుబడి పెట్టారు. ‘కంపెనీ నాయకత్వం గురించి నాకు బాగా తెలుసు. వారి విజన్ నచ్చడంతో నైకాలో పెట్టుబడి పెట్టాను’ అని కత్రినా తెలిపింది. అయితే ఈ కంపెనీ ఐపీవోకి వచ్చినప్పుడు దాదాపు 10 రెట్లు పెరిగింది. అనంతరం మాత్రం షేర్ ధర కొంచెం పడుతూ వచ్చింది. వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ‘సస్టైన్‌కార్ట్’ అనే బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారింది.

Updated Date - 2022-03-14T16:39:02+05:30 IST