‘పని మనిషి’ పాత్ర కోసం అందాల తిలోత్తమని నల్లగా మార్చేసిన హాలీవుడ్ డైరెక్టర్!

ABN , First Publish Date - 2021-12-25T00:55:15+05:30 IST

అందాలకి కొలమానాలు నిర్ధారించటం, తెల్లని మేని ఛాయపై ఎక్కడలేని యావ... వీటి గురించి సూటిగా మాట్లాడింది నటి తిలోత్తమ షోమ్. ఓ అమెరికన్ మూవీలో నటిస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవం ఆమె చెప్పుకొచ్చింది. ఆ సినిమా పేరు, దర్శకుడెవరు అన్నది చెప్పలేదు కానీ... అతను చేసిన ఘన కార్యం మాత్రం వివరించింది...

‘పని మనిషి’ పాత్ర కోసం అందాల తిలోత్తమని నల్లగా మార్చేసిన హాలీవుడ్ డైరెక్టర్!

అందాలకి కొలమానాలు నిర్ధారించటం, తెల్లని మేని ఛాయపై ఎక్కడలేని యావ... వీటి గురించి సూటిగా మాట్లాడింది నటి తిలోత్తమ షోమ్. ఓ అమెరికన్ మూవీలో నటిస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవం ఆమె చెప్పుకొచ్చింది. ఆ సినిమా పేరు, దర్శకుడెవరు అన్నది చెప్పలేదు కానీ... అతను చేసిన ఘన కార్యం మాత్రం వివరించింది. 


తిలోత్తమ ఓ హాలీవుడ్ మూవీలో పని మనిషి పాత్ర చేసిందట. అయితే, ఆమె ఒంటి రంగు మరీ నల్లగా లేకపోవటంతో డైరెక్టర్ ఆమెని మరింత ‘డార్క్’గా మార్చేందుకు మేకప్ డిపార్ట్‌మెంట్ సాయం తీసుకున్నాడట. అంతే కాదు, ‘‘పేదవాళ్లు అంత అందంగా ఉంటే ఎలా?’’ అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడట! 


అందం గురించి, అందం విషయంలో చాలా మందిలో ఉన్న తప్పుడు ఆలోచనా ధోరణి గురించి, ఫెయిర్ స్కిన్ అబ్సెషన్ గురించి తిలోత్తమ లోతుగా విశ్లేషించింది. హాలీవుడ్ డైరెక్టర్ తనని నల్లగా చూపించాలని ప్రయత్నించటం మొదలు ఇంటర్నెట్‌లో నెటిజన్స్ ‘‘నీకంటే మా ఇంట్లో పని మనిషి అందంగా ఉంటుం’’దని కామెంట్స్ చేయటం వరకూ... అందరికీ ‘‘పేదోళ్లు అంద విహీనంగా ఉంటా’’రనే దురభిప్రాయం ఉందని తెలిపింది తిలోత్తమ. దానితో పాటూ నల్లటి వారి కంటే తెల్లని వాళ్లు అందమైన వాళ్లనే పిచ్చి కూడా ఉందని ఆమె ఘాటుగా విమర్శించింది. అదృష్టవశాత్తూ తన చిన్ననాటి నుంచీ తమ ఇంట్లోకి ‘ఫెయిర్ అండ్ లవ్లీ అబ్సెషన్’ ఏనాడూ చొరబడలేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది.


మొదటిసారి ‘మాన్సూన్ వెడ్డింగ్’ సినిమాలో నటిగా వెండితెరపై కనిపించిన తిలోత్తమ తరువాత అనేక ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాల్లో అలరించింది. ‘షాంఘై’, ‘కిస్సా’, ‘ఏ డెత్ ఇన్ ద గంజ్’ లాంటి చిత్రాల్లో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ‘సర్’ సినిమాకిగానూ ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రస్ (క్రిటిక్స్)  అవార్డు లభించింది.   

Updated Date - 2021-12-25T00:55:15+05:30 IST