అలియా, రణ్ బీర్ పెళ్లి కోసం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు..!

ABN , First Publish Date - 2022-04-10T23:41:14+05:30 IST

అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో

అలియా, రణ్ బీర్ పెళ్లి కోసం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు..!

అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరగబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి జరిగే తేదీని మాత్రం ఈ జంట అత్యంత రహస్యంగా ఉంచారు. 


తమ పెళ్లి అత్యంత సురక్షితంగా జరగాలని అలియా భట్- రణ్‌బీర్ కపూర్ భావిస్తున్నారు. అందు కోసం దాదాపుగా 200మంది బౌన్సర్లను నియమించుకున్నారు. వివాహం జరిగే రోజు ఈ బౌన్సర్లు భద్రతను కల్పిస్తారని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట గత నెలరోజులుగా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకలకు సంబంధించిన విషయాలను మహేశ్ భట్ కొడుకు రాహుల్ భట్ తాజాగా మీడియాకు వెల్లడించాడు. ‘‘ముంబై బెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘9/11’ పెళ్లి భద్రతా ఏర్పాట్లను చూస్తుంది. వివాహం కోసం ఈ ఏజెన్సీ దాదాపుగా 200మంది బౌన్సర్లను నియమించుకుంది. రణ్‌బీర్ కపూర్‌కు చెందిన ‘ఆర్‌కే స్టూడియో’, ‘వాస్తు’ వద్ద ఈ గార్డులు భద్రతను కల్పిస్తారు. సెక్యూరిటీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగించే అవకాశం ఉంది’’ అని రాహుల్ భట్ చెప్పాడు. అలియా భట్ పెళ్లి ఏప్రిల్ 14న జరగబోతున్నట్టు బీ టౌన్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో ఈ వివాహం జరగబోతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-04-10T23:41:14+05:30 IST