వినాయక్‌ చేతుల మీదుగా

ABN , First Publish Date - 2022-08-08T06:03:22+05:30 IST

‘ప్రేమంటే సులువు కాదురా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు చందా గోవిందరెడ్డి. ఇప్పుడు నిర్మాతగా మారారు....

వినాయక్‌ చేతుల మీదుగా

‘ప్రేమంటే సులువు కాదురా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు చందా గోవిందరెడ్డి. ఇప్పుడు నిర్మాతగా మారారు. శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి క్రియేషన్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్‌ లోగోను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ‘‘కొత్త నిర్మాణ సంస్థలు మరిన్ని రావాలి. అప్పుడే చిత్రసీమ కళకళలాడుతుంది. నిర్మాతగా గోవింద్‌ రెడ్డి మంచి విజయాల్ని అందుకోవాల’’ని వినాయక్‌ ఆకాంక్షించారు. ‘‘కథ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామ’’ని గోవింద్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ దర్శకుడు సాగర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:03:22+05:30 IST