RRR, బీస్ట్, ఆచార్య OTTలోకి వచ్చేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-05-05T16:29:30+05:30 IST

సినిమాలు ప్రకటించినప్పటి నుంచి ఎంతో బజ్ క్రియేటైన సౌత్ మూవీస్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’...

RRR, బీస్ట్, ఆచార్య OTTలోకి వచ్చేది ఎప్పుడంటే..

సినిమాలు ప్రకటించినప్పటి నుంచి ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న సౌత్ మూవీస్‌ ‘ఆర్ఆర్ఆర్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలు బజ్‌కి తగ్గట్టుగానే అభిమానులను సినీ లవర్స్‌ని థియేటర్స్‌లో ఎంటర్‌టైన్ చేశాయి. థియేటర్స్‌లో చూడని వారికోసం ఈ క్రేజీ మూవీస్ త్వరలో ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.


బీస్ట్..

తమిళ నటుడు విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్’. శివకార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.


RRR..

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్ల రుపాయలను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అని నిరూపించుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవ్వుతోందని సమాచారం. అయితే.. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో జీ5లో విడుదల కానుండగా.. హిందీలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఒకేసారి మే 20న రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఆచార్య..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. విడుదలై నెల కూడా గడవక ముందే మే 27, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.



Updated Date - 2022-05-05T16:29:30+05:30 IST