బాక్సాఫీస్ బరిలో మూడు సినిమాలు.. ప్రేక్షకుల మొగ్గు ఏటు‌వైపు..

ABN , First Publish Date - 2022-04-05T01:27:51+05:30 IST

కరోనాతో వాయిదా పడిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్

బాక్సాఫీస్ బరిలో మూడు సినిమాలు.. ప్రేక్షకుల మొగ్గు ఏటు‌వైపు..

కరోనాతో వాయిదా పడిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పడం లేదు. ఈ ఏప్రిల్‌లో ఒక్క రోజు తేడాతోనే మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. ‘కేజీఎఫ్: చాప్టర్-2’, ‘బీస్ట్’, ‘జెర్సీ’ సినిమాలు ఏప్రిల్ 13, 14తేదీల్లో అభిమానుల ముందుకీ రానున్నాయి. దాదాపుగా రూ.320కోట్లలను నిర్మాతలు ఈ చిత్రాలపై పెట్టుబడిగా పెట్టారు. 


‘కేజీఎఫ్-2’ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. కన్నడతో పాటు పలు భాషల్లోను ఈ సినిమా విడుదల కానుంది. దాదాపుగా రూ.100కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. మొదటి భాగం బాలీవుడ్, టాలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. దీంతో  సీక్వెల్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర బృందం కూడా చాలా రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంది. బాలీవుడ్ నటులు కూడా ఇందులో నటించడంతో హిందీ మార్కెట్‌లో కూడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉంది. మాస్ ప్రేక్షకుల మొదటి ఛాయిస్ ఈ సినిమానే అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ‘కేజీఎఫ్-2’ ఏప్రిల్-14న విడుదల కానుంది. 


ఇళయదలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బీస్ట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. తమిళంలో నిర్మించిన ఈ మూవీని పలు భాషల్లో డబ్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. యూట్యూబ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. విజయ్ ‘బీస్ట్’లో ఇండియన్ స్పై ఏజెంట్‌గా అలరించనున్నాడు. వీర రాఘవన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. చెన్నై, ఈస్ట్ కోస్ట్ మాల్‌లో ఉన్న వారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే.. వారిని విజయ్ ఏలా కాపాడాడు అనేదే చిత్ర కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రూ. 150కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ట్రైలర్ విడుదల అనంతరం ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చివరగా...షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా ‘జెర్సీ’. టాలీవుడ్ హిట్  చిత్రం ‘జెర్సీ’కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్‌. షాహిద్ గత సినిమా ‘కబీర్ సింగ్’ భారీ విజయం సాధించడంతో ‘జెర్సీ’పై కూడా మంచి బజ్ ఉంది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 13నే విడుదల కానుంది. మరి .. ఈ మూడు సినిమాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2022-04-05T01:27:51+05:30 IST