ఈ వారం సందడి చేసే చిత్రాలివే

ABN , First Publish Date - 2022-02-21T20:24:09+05:30 IST

కరోన తగ్గడం, థియేటర్ల పరిస్థితులు ఓ కొలిక్కి రావడంతో భారీ చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం.

ఈ వారం సందడి చేసే చిత్రాలివే


ఈ వారం ఓటీటీ చిత్రావిలే...

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘సెహరి’.  అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్‌ గోమఠం కీలక పాత్రధారులు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆహా’లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ర్టీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌...

ద ప్రొటేష్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25

నెట్‌ఫ్లిక్స్‌
ద ఫేమ్‌ గేమ్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 25

వైకింగ్స్‌: వాల్హా (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25

జువైనల్‌ జస్టిస్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25

ఎ మాడియా హోమ్‌ కమింగ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25


డిస్నీ హాట్‌ స్టార్‌...
స్టార్‌ వార్స్‌ ఒబీ –వాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25

జీ 5
లవ్‌ హాస్టల్‌ (హిందీ)ఫిబ్రవరి 25

సోనీ లివ్‌

అజగజాంతరం (మలయాళం) ఫిబ్రవరి 25

ఎ డిస్కవరీ ఆఫ్‌ విచెస్‌ (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి 25


కరోన తగ్గడం, థియేటర్ల పరిస్థితులు ఓ కొలిక్కి రావడంతో భారీ చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. బాక్సాఫీస్‌  వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 


పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్‌’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, టీజర్‌లతో సినిమాకు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందించడం విశేషం. అయితే పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు ఈ కథను మార్పులు చేశారు. రానా మరో నాయకుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలు. 


యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వలిమై’


తమిళనాట అజిత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ ఆయనకు అభిమానులున్నారు. మంచి మార్కెట్‌ ఉంది.  అంతుకే తెలుగులోనూ ఆయన ప్రతి సినిమాను విడుదల చేస్తుంటారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తాజాగా ఆయన నటించిన ‘వలిమై’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ఇందులో విలన్‌గా నటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 

గంగూబాయ్‌ ఎదుగుదల....

వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేసే సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘గంగూబాయ్‌ కతియావాడి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఆలియా భట్‌ టైటిల్‌ పాత్ర వహించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషించారు. నటిగా ఎదుగుదామని ఎన్నో కలలు కన్న గంగా హరిజీవన్‌దాస్‌ అనే మహిళ మోసపోయి ఎలా కథియావాడికి చేరింది? అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? వాటిని అధిగమించుకుని శక్తిమంతమైన మహిళగా ఎదగడమే కాకుండా రాజకీయాల్లో సత్తా చాటి ఓ డాన్‌గా ఎలా ఎదిగింది? కతియావాడిలో మహిళల ఉన్నతికి ఎలా కృషిచేసింది అన్నది ఇతివృత్తం. కరోనా కారణాలంగా రెండేళ్లుగా సెట్‌కే పరిమితమైన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకయముందుకి రానుంది. 



Updated Date - 2022-02-21T20:24:09+05:30 IST