Laththi: విశాల్ ‘లాఠీ’ వాయిదా.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-07-12T23:30:28+05:30 IST

యాక్షన్ హీరో విశాల్ (Vishal) హీరోగా.. ఎ.వినోద్‌ కుమార్‌ (Vinod Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ (Laththi). హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న

Laththi: విశాల్ ‘లాఠీ’ వాయిదా.. కారణమిదే!

యాక్షన్ హీరో విశాల్ (Vishal) హీరోగా.. ఎ.వినోద్‌ కుమార్‌ (Vinod Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ (Laththi). హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన సునైనా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కానీ, ఈ చిత్ర షూటింగ్‌లో విశాల్‌కి గాయాలవడం, అలాగే ఫైట్ సీక్వెన్స్‌ కోసం భారీ విఎఫ్ఎక్స్ వర్క్ మిగిలి ఉండటంతో..  చిత్రాన్ని సెప్టెంబర్ 15కి వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.


తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని భాషలలోనూ ఒకే టైటిల్‌‌తో రూపొందుతోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌ని దర్శకుడు వినోద్‌ కుమార్‌ సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్‌ ఆ ‘లాఠీ’తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్‌కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని నిర్మాతలు చెబుతున్నారు. పొన్ పార్థిబన్ రచయితగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సామ్‌ సిఎస్‌ సంగీత అందిస్తున్నారు.



Updated Date - 2022-07-12T23:30:28+05:30 IST