Mahesh-Rajamouli: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పబ్లిసిటీ మహేష్ కోసమట!

ABN , First Publish Date - 2022-08-28T01:08:42+05:30 IST

రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘RRR’ చిత్రం ఇంకా వార్తల్లోనే వుంది. ఆ సినిమా విడుదలైంది.. బాగా డబ్బులు కూడా వసూలు చేసింది.. అందులో నటించిన ఒక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్..

Mahesh-Rajamouli: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పబ్లిసిటీ మహేష్ కోసమట!

రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘RRR’ చిత్రం ఇంకా వార్తల్లోనే వుంది. ఆ సినిమా విడుదలైంది.. బాగా డబ్బులు కూడా వసూలు చేసింది.. అందులో నటించిన ఒక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్‌లో కూడా ఉండటం విశేషం. కానీ, ఇంకా ఆ సినిమాని రాజమౌళి ప్రమోట్ చేస్తూనే వున్నాడు. ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. సినిమా విడుదలై చాలా రోజులైనా, ఇంకా రాజమౌళి ఎందుకు ఆ సినిమాని అంతలా ప్రమోట్ చేస్తున్నాడంటే.. తదుపరి ఆయన మహేష్ బాబు (Mahesh Babu)తో చేయబోయే సినిమా కోసమని టాక్. 


మహేష్‌తో చేయనున్న సినిమాని రాజమౌళి 2023లో ప్రారంభించనున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాని ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కన్నా ఇంకా ఎక్కువగా.. ప్రపంచం నలుమూలలకు రీచ్ అయ్యేలా చేయాలంటే.. దానికి ఇప్పటి నుండే పునాది వేయాలని రాజమౌళి అనుకుంటున్నట్టుగా చిత్రసీమలో టాక్ వినబడుతోంది. అటువంటి హైప్ రావాలంటే, ఇప్పుడున్న ‘ఆర్ఆర్ఆర్’ని విస్తృతంగా ప్రచారం చేస్తే, రాబోయే సినిమాకి ఇంకా బాగా హైప్ వస్తుంది.. ఇంకా విస్తృతంగా ప్రపంచమంతా సినిమాని విడుదల చేయవచ్చని రాజమౌళి అనుకుంటున్నట్టుగా.. ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారని కూడా తెలిసింది.  (Mahesh Babu and Rajamouli)


మహేష్‌తో తీసే సినిమా ఎటువంటిది.. సాంఘీకమా, రాజకీయమా, స్పై సినిమానా? లేక వేరే ఇతర జానర్ ఎంచుకున్నాడా? అన్నది ఇంకా తెలియలేదని అంటున్నారు. ఇప్పటికయితే రాజమౌళి ఒక్క మహేష్ బాబు‌తోనే మాట్లాడుతున్నాడు.. అందుకే సినిమాకి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రావడంలేదని.. ఆయన సన్నిహితులు అనుకుంటుండటం విశేషం. ఏది ఏమైనా కూడా, ఈసారి రాజమౌళి మాత్రం పెద్ద ప్లాన్‌తోటే మహేష్ సినిమా చేస్తున్నట్టు భోగట్టా.

Updated Date - 2022-08-28T01:08:42+05:30 IST