ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీ : Sibiraj

ABN , First Publish Date - 2022-07-20T19:17:53+05:30 IST

శిబిరాజ్‌ (Sibiraj) హీరోగా, ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah), అతుల్య రవి (Athulya Ravi) హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వట్టం’ (Vattam).

ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీ : Sibiraj

శిబిరాజ్‌ (Sibiraj) హీరోగా, ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah), అతుల్య రవి (Athulya Ravi) హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వట్టం’ (Vattam). నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మించారు. ఎడ్జ్‌ ఆఫ్‌ సీట్‌ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా గురించి హీరో శిబిరాజ్‌ మాట్లాడుతూ.. ‘ఇది నా కెరీర్‌లోనే ముఖ్యమైన చిత్రం. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్‌ బ్యానరులో నటించడం గొప్పగా భావిస్తున్నాను. ఒక సాధారణ యువకుడిగా నటించాలన్న కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరింది. పెద్ద ఆశయాలు లేకుండా ఆ క్షణంలో జీవితాన్ని గడిపే వ్యక్తిగా నటించాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.


దర్శకుడు కమలకన్నన్‌ మాట్లాడుతూ.. ‘జీవిత చక్రం అనేది ఆశల పల్లకీలో ఊరేగుతుంది. మన దైనందిన జీవితం కూడా అలాగే కొనసాగుతుంది. సాఫీగా సాగిపోతున్న ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అనుకోకుండా చోటుచేసుకునే మార్పులు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. జీవితాన్ని వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది. ఒక మనిషి జీవితంలో 24 గంటల్లో జరిగే మార్పులే ఈ సినిమా స్ర్కీన్‌ప్లే’ అని, త్వరలోనే రిలీజ్‌ తేదీ వెల్లడించనున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-07-20T19:17:53+05:30 IST