F3 single promo : ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా..’ అంటున్న వెంకీ, వరుణ్

ABN , First Publish Date - 2022-05-16T16:12:00+05:30 IST

విక్టరీ వెంకటేశ్ (Venkateseh), మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (VaruntejA) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’ (F3). సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో హిలేరియస్ కామెడీని రెండో భాగంలో వర్కవుట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. మే 27న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్‌లో నవ్వుల సందడి చేయబోతోంది.

F3 single promo : ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా..’ అంటున్న వెంకీ, వరుణ్

విక్టరీ వెంకటేశ్ (Venkateseh), మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్ (VaruntejA) హీరోలుగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’ (F3). సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో హిలేరియస్ కామెడీని రెండో భాగంలో వర్కవుట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. మే 27న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్‌లో నవ్వుల సందడి చేయబోతోంది. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతుండగా..  సునీల్ , మురళీ శర్మ పాత్రలు అదనంగా వచ్చి చేరాయి. డబ్బు చుట్టూ తిరిగే కథాంశంతో ‘సమ్మర్ సోగ్గాళ్ళు’ గా వెంకీ, వరుణ్‌లు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించబోతున్నారు. వెంకీ రేచీకటి, వరుణ్ నత్తి సినిమాకే హైలెట్స్ గా నిలవబోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 3’ చిత్రం ట్రైలర్ కు ఓ రేంజ్ లో రెస్పాన్ప్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండే.. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సింగిల్స్ కు మంచి స్పందన దక్కగా.. ఇప్పుడు మూడో సింగిల్ విడుదల కానుంది. 


ఈ నెల 17న ‘ఎఫ్ 3’ (F3) చిత్రంలోని మూడో సాంగ్ .. ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా..’ అంటూ సాగే సాంగ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ పాటకి సంబంధించిన ప్రోమో ఈ రోజు (సోమవారం) విడుదలైంది.  ఈ సింగిల్ కు అందాల పూజా హెగ్డే (Pooja hegde)  స్పెషల్ అట్రాక్షన్ అయింది. రెడ్‌డ్రెస్‌లో రివీలైన పూజా వెంకీ, వరుణ్ లతో చిందేస్తూ విందు అందించింది.  కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లింగజ్, గీతా మాధురి ఆలపించారు.  ఈ సందర్భంగా ఒక ఆకర్షణీయమైన పోస్టర్‌ను వదిలారు. Party Song of the Year గా ఈ పాటను పేర్కొన్నారు.  దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఈ సినిమా ఈ వేసవికి మంచి వినోదాన్ని అందిస్తుందని చెబుతున్నారు.


దేవీశ్రీ ప్రసాద్ (Devisri prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణ, ప్రగతి, రఘుబాబు, ప్రకాశ్ రాజ్, సినియర్ యాక్టర్ ప్రదీప్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తోడల్లుళ్లుగా వెంకీ, వరుణ్ పూయించబోయే నవ్వులకు ఇంకా పన్నెండు రోజులు టైమ్ ఉండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించిన స్థాయిలో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.  



Updated Date - 2022-05-16T16:12:00+05:30 IST