The Kashmir Filesపై కామెంట్స్‌తో Sai Pallaviపై దారుణమైన ట్రోలింగ్.. గతంలో ఇదే విషయమై Aamir Khan ఏమన్నాడో తెలుసా..?

ABN , First Publish Date - 2022-06-16T21:59:44+05:30 IST

టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వివాదాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ మరికొన్ని గంటల్లో విడుదలకు..

The Kashmir Filesపై కామెంట్స్‌తో Sai Pallaviపై దారుణమైన ట్రోలింగ్.. గతంలో ఇదే విషయమై Aamir Khan ఏమన్నాడో తెలుసా..?

టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వివాదాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వ్యక్తం చేసిన అభిప్రాయం వివాదానికి తెర లేపింది. సాయిపల్లవి వ్యక్తం చేసిన అభిప్రాయంపై కొందరు విభేదించడంతో ఆమె చిక్కుల్లో పడింది. గో ప్రేమికులను కశ్మీర్‌ ఉగ్రవాదులతో ఆమె పోల్చారని సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు భజరంగ్ దళ్‌ ఫిర్యాదు చేసింది. అసలు సాయి పల్లవి ఏం చెప్పింది..? ఆమె చుట్టూ ఎందుకింత వివాదం నడుస్తోంది..? ఆమె ఇంటర్వ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయం యథాతథంగా..


‘‘కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో ‘If You Taking A Religious Conflict’ లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో Cowని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ Difference ఎక్కడ ఉంది..? సో ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం’’ అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు.



ఎవరో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి, ఒక మొత్తం కమ్యూనిటీపై జరిగిన నర మేధానికి చాలా తేడా ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మా బాధను చిన్నచూపు చూడొద్దంటూ ట్వీట్ చేశాడు. ఒకసారి వచ్చి పగిలిన మా గుండెలను, ధ్వంసమైన మా ఇళ్లను సాయిపల్లవి చూడాలని, ఆ నర మేధానికి మిగిలిన సజీవ సాక్ష్యాలం తామేనని ఒక నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి విమర్శల పాలైన వాళ్లు ఇప్పటికే కొందరు ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’ అని వ్యాఖ్యానించాడు. అయితే.. కశ్మీరీ పండిట్లపై ఇదే అమీర్ ఖాన్ గతంలో ఇందుకు పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆ వీడియోను వైరల్ చేసి సోషల్ మీడియాలో అమీర్ ఖాన్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.



అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై జోకులేసి ట్రోలింగ్‌కు గురయింది. తాను ఒక సినిమా తీయాలనుకుంటున్నానని, ఆ సినిమా పేరు ‘Nail Files’ అని ఆమె వెటకారం చేసింది. ఈ కుళ్లు జోక్ కారణంగా ట్వింకిల్ తీవ్ర విమర్శల పాలైంది. సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన షా కూడా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కామెంట్ చేసి ట్రోలర్స్‌కు టార్గెట్ అయ్యాడు. వివేక్ అగ్నిహోత్రి తీసిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా అంతా దాదాపు కల్పితమేనని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పాటు చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న అమానుష పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తే అంతా కల్పితమని ఎలా అంటారని నసీరుద్దీన్ షాను కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు.

Updated Date - 2022-06-16T21:59:44+05:30 IST