కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు

ABN , First Publish Date - 2022-05-26T06:41:40+05:30 IST

‘‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి గుర్తుండిపోయే హిట్‌ ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌. నాగచైతన్య హీరోగా ఆయన రూపొందిస్తున్న...

కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు

‘‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి గుర్తుండిపోయే హిట్‌ ఇచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌. నాగచైతన్య హీరోగా ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. జులై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చిత్రబృందం టీజర్‌ని విడుదల చేసింది. నాగచైతన్య వ్యాపారవేత్త అభిరామ్‌ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ‘అన్నీ వదులుకొని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు’ అంటూ నాగచైతన్య పలికిన డైలాగ్‌ వింటే ఈ చిత్రం బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రాశిఖన్నా, మాళవికా నాయర్‌ నటించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. తమన్‌  సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్‌. 


Updated Date - 2022-05-26T06:41:40+05:30 IST