VJ Chitra కేసులో ట్విస్ట్.. భార్యాభర్తల గదిలో అన్ని కండోమ్స్ ఎందుకున్నాయి..?

ABN , First Publish Date - 2022-05-16T22:38:02+05:30 IST

తమిళ బుల్లి తెర నటి VJ Chitra ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 17 నెలల తర్వాత ఆమె ఆత్మహత్య కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తమ కూతురి మృతిపై..

VJ Chitra కేసులో ట్విస్ట్.. భార్యాభర్తల గదిలో అన్ని కండోమ్స్ ఎందుకున్నాయి..?

చెన్నై: తమిళ బుల్లి తెర నటి VJ Chitra ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 17 నెలల తర్వాత ఆమె ఆత్మహత్య కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తమ కూతురి మృతిపై నిజానిజాలను నిగ్గు తేల్చేలా మరోసారి దర్యాప్తు జరిపించాలని కోరాలని VJ Chitra తల్లిదండ్రులు యోచిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 9, 2020న హోటల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో వీజే చిత్ర కనిపించింది. ఆమె ఆత్మహత్య కేసులో చిత్ర భర్త హేమంత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. తన భార్య చిత్ర తాను హోటల్ నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకుని కనిపించిందని.. ఆమె మృతికి తాను కారణం కాదని హేమంత్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 15న బెయిల్‌పై హేమంత్ విడుదలయ్యాడు. తన భార్య ప్రాణం పోవడానికి కారణమైనవాళ్లు కూడా చచ్చిపోవాలని ఇటీవల కూడా హేమంత్ వ్యాఖ్యానించాడు.



ఇదిలా ఉండగా.. చిత్రకు అత్యంత ఆప్తురాలైన ఆమె స్నేహితురాలు రేఖా నాయర్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. హేమంత్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చిత్ర ఆత్మహత్యకు పాల్పడటానికి కారకులని రేఖా నాయర్ ఆరోపించింది. అయితే.. ఆమె చేసిన ఈ ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం గమనార్హం. రేఖా నాయర్‌ చెప్పిన కొన్ని విషయాలు విస్తుపోయేలా చేశాయి. చిత్ర, ఆమె భర్త హేమంత్ కలిసి ఉన్న గదిలో చాలా కండోమ్స్ ఉన్నాయని, భార్యాభర్తలు మాత్రమే ఉన్న ఆ గదిలో అన్ని కండోమ్స్ ఎందుకు ఉన్నాయని రేఖా నాయర్ ప్రశ్నించింది.

Updated Date - 2022-05-16T22:38:02+05:30 IST