రెండు సంవత్సరాలు... ఇద్దరు స్టార్ హీరోలు... అభిమానులకి తప్పని గుండెకోత

ABN , First Publish Date - 2021-10-29T22:01:20+05:30 IST

కన్నడ సినిమా రంగం, యావత్ కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం విషాదంలో ఉన్నాయి. కారణం... పూనీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణమే...

రెండు సంవత్సరాలు... ఇద్దరు స్టార్ హీరోలు... అభిమానులకి తప్పని గుండెకోత

కన్నడ సినిమా రంగం, యావత్ కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం విషాదంలో ఉన్నాయి. కారణం... పూనీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణమే. లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన ఆయన, లక్షలాది మంది అభిమానులకు వెండితెరవేల్పు. అటువంటి ఐకాన్ గుండెపోటుతో చనిపోవటంతో ఇప్పుడు అందరూ షాక్‌లోనే ఉన్నారు. అయితే, కన్నడ సినీ ప్రియులకి వరుసగా ఇది రెండో విభ్రాంతి. పోయిన సంవత్సరం కూడా వారికి విషాదం తప్పలేదు...


2020 జూన్ 7న శాండల్‌వుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కనీసం 40 ఏళ్లు కూడా దాటని యంగ్ యాక్టర్ చిరంజీవి సర్జా ఇక లేరనే విషయం అభిమానులు అస్సలు నమ్మలేకపోయారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడైన ఆయన 20 వరకూ సినిమాల్లో నటించాడు. మంచి స్టార్‌డమ్ సంపాదించుకుని అగ్ర హీరోగా ఎదుగుతున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ బలి తీసేసుకుంది. చిరంజీవి సర్జా మరణం సమయానికి ఆయన భార్య, నటి మేఘన రాజ్ గర్భవతిగా ఉండటం జనాన్ని మరింత విషాదానికి గురి చేసింది.   

Updated Date - 2021-10-29T22:01:20+05:30 IST