Avatar: The Way Of Water: కేరళలో ‘అవతార్ 2’ కు షాక్..!

ABN , First Publish Date - 2022-11-30T22:25:17+05:30 IST

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్’ (Avatar). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

Avatar: The Way Of Water: కేరళలో ‘అవతార్ 2’ కు షాక్..!

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్’ (Avatar). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. అందువల్ల మేకర్స్ సీక్వెల్ ‘అవతార్ 2’ (Avatar 2)ను రూపొందించారు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. నిర్మాతలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. తెలుగు, తమిళ్ థియేట్రీకల్ రైట్స్ కావాలంటే రూ.100కోట్లకు పైగా చెల్లించాలని అడిగారు. కానీ, అంత ధర చెల్లించేందుకు ఏ నిర్మాత ముందుకు రాలేదు. తాజాగా కేరళలో ‘అవతార్ 2’ కు షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు.  


ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ‘అవతార్ 2’ ని బ్యాన్ చేసింది. సినిమాకు ఫస్ట్ వీక్‌లో వచ్చే థియేట్రీకల్ కలెక్షన్స్ నుంచి 60శాతం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేయడంతో FEUOK ఈ నిర్ణయం తీసుకుంది. మాములుగా థియేటర్ ఓనర్స్ 50శాతం షేర్ ఇస్తారు. ‘అవతార్ 2’ పై క్రేజ్ విపరీతంగా ఉంది. అందువల్ల 55శాతం షేర్ ఇవ్వడానికి థియేటర్ ఓనర్స్ అంగీకరించారు. కానీ, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 60శాతానికి తగ్గేది లేదని తెగేసి చెప్పడంతో ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ ‘అవతార్ 2’ ను బ్యాన్ చేయాలని నిర్ణయించుకుంది. FEUOK ఆధీనంలో దాదాపుగా 400థియేటర్స్ ఉన్నాయి. ఈ సినిమా హాల్స్ అన్నింటిలోను ఈ మూవీని స్క్రీన్ చేసే అవకాశం లేదు. థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తేనే ‘అవతార్ 2’ ను ప్రదర్శించడానికి ఆస్కారం ఉంది. సంప్రదింపులు విఫలమైతే సినీ ప్రేమికులందరు నిరాశకు గురి కావాల్సిందే. 

Updated Date - 2022-11-30T22:25:17+05:30 IST