Oscars : ఆమె వయస్సు 10 ఏళ్లు... అతడి వయస్సు 83 ఏళ్లు...

ABN , First Publish Date - 2022-03-27T22:52:16+05:30 IST

ఈసారి ఉత్తమ నటీనటులుగా ఎవరు ట్రోఫీల్ని సాధిస్తారో మనకు ఇంకా తెలియదుగానీ... చరిత్రలో అతి పిన్న వయస్సులో, అలాగే అత్యంత ఆలస్యంగా ఆస్కార్స్ చేజిక్కించుకున్న టాలెంటెడ్ యాక్టర్స్ మాత్రం ఇద్దరున్నారు! ఆ యంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆస్కార్ విన్నర్స్ ఎవరో మీకు తెలుసా?

Oscars : ఆమె వయస్సు 10 ఏళ్లు... అతడి వయస్సు 83 ఏళ్లు...

మార్చ్ 28న 94వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరుగనుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన ఆస్కార్స్‌ని అందుకోవటం ఎవరికైనా జీవిత కాలం పాటూ మరిచిపోలేని మథుర జ్ఞాపకమే. ఈసారి ఉత్తమ నటీనటులుగా ఎవరు ట్రోఫీల్ని సాధిస్తారో మనకు ఇంకా తెలియదుగానీ... చరిత్రలో అతి పిన్న వయస్సులో, అలాగే అత్యంత ఆలస్యంగా ఆస్కార్స్ చేజిక్కించుకున్న టాలెంటెడ్ యాక్టర్స్ మాత్రం ఇద్దరున్నారు! ఆ యంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆస్కార్ విన్నర్స్ ఎవరో మీకు తెలుసా? 


టాటమ్ ఓ‘నీల్... ఈ టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ 1974లో 46వ అకాడమీ అవార్డ్స్ వేదికపై పురస్కారాన్ని అందుకుంది. అయితే, బాలనటిగా కాదు. కేవలం 10 సంవత్సరాల 106 రోజుల వయస్సులో ఓ‘నీల్ తనకంటే పెద్దవారితో పోటీపడి ‘ఉత్తమ సహాయ నటి’ అవార్డ్ పొందింది. ‘పేపర్ మూన్’ సినిమాకిగానూ తనకి ఈ ఆస్కార్ లభించింది. ఇక అకాడమీ అవార్డుల చరిత్రలో ఓల్డెస్ట్ ట్రోఫీ విన్నర్‌గా ఆంథోనీ హాప్‌కిన్స్ సంచలనం సృష్టించాడు. 2021లో ఆయన ‘ద ఫాదర్’ సినిమాలోని పాత్రకిగానూ ‘ఉత్తమ నటుడు’ పురస్కారం పొందాడు. ఆస్కార్ చేబట్టిన రోజుకి ఆయన వయస్సు... 83 ఏళ్ల 115 రోజులు! 

Updated Date - 2022-03-27T22:52:16+05:30 IST