Vicky, Katrina పెళ్లిలో అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు.. రేంజ్‌రోవర్ కార్లు, 100 మంది బౌన్సర్లతో సెక్యూరిటీ..!

ABN , First Publish Date - 2021-11-18T20:28:35+05:30 IST

‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రీనా యువరాణి. ప్యాలెస్‌లో ఉంటుంది. నిజ జీవితంలో ఆమె అంత ధనవంతురాలైతే కాదు. బ్రిటన్‌లో వాళ్లది సాదాసీదా కుటుంబం. కానీ, బాలీవుడ్‌లోకి వచ్చాక క్యాట్‌గా మారిపోయిన కత్రీనా... ఇప్పుడు ఇండియాలోని టాప్ స్టార్స్‌లో ఒకరు. మరి బీ-టౌన్ గ్లామర్ గాడెస్ వెడ్డింగ్ అంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి కదా...

Vicky, Katrina పెళ్లిలో అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు.. రేంజ్‌రోవర్ కార్లు, 100 మంది బౌన్సర్లతో సెక్యూరిటీ..!

‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రీనా యువరాణి. ప్యాలెస్‌లో ఉంటుంది. నిజ జీవితంలో ఆమె అంత ధనవంతురాలైతే కాదు. బ్రిటన్‌లో వాళ్లది సాదాసీదా కుటుంబం. కానీ, బాలీవుడ్‌లోకి వచ్చాక క్యాట్‌గా మారిపోయిన కత్రీనా... ఇప్పుడు ఇండియాలోని టాప్ స్టార్స్‌లో ఒకరు. మరి బీ-టౌన్ గ్లామర్ గాడెస్ వెడ్డింగ్ అంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి కదా... అందుకే, మన ‘మల్లీశ్వరి’ గారి పెళ్లి రాజస్థాన్‌లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో ఘనంగా జరగబోతోంది! ఆల్రెడీ రేంజ్‌రోవర్ల స్థాయిలో కొనసాగుతోన్న ప్రిపరేషన్స్‌పై... ఓ రేంజ్‌లో ప్రచారం సాగుతోంది...


కత్రీనా, విక్కీ కౌశల్ వివాహం డిసెంబర్లో జరగనుంది. జైపూర్‌లోని ‘హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్’ వచ్చే నెల 7, 8, 9వ తేదీల్లో వేడుకలకి వేదిక కానుంది. శతాబ్దాల కిందటి రాజ్‌పుత్ రాజుల రాయల ప్యాలెస్ ఇప్పటికే అందరి నోళ్లలోనూ నానుతోంది. రాజసం ఉట్టిపడే రాజప్రాసాదంలో విక్కీ, కత్రీనాతో పాటూ వారిద్దరి కుటుంబం సభ్యులు 48 గదుల్లో విడిది చేస్తారు. వారు కాకుండా ఇతర ప్రముఖ, ప్రధాన అతిథులంతా జైపూర్‌లోనే ఉన్న తాజ్, ఒబెరాయ్ హోటల్స్‌లో విడిది చేస్తారు. వారి కోసం ఆ రెండు ఫై స్టార్ హోటల్స్ పూర్తిగా బుక్ చేసేశారట. అలాగే, దాదాపు 125 మంది వీఐపీ గెస్ట్స్ అటెండ్ అవుతారని ప్రచారం జరుగుతోన్న గ్రాండ్ ఈవెంట్‌లో ఎటు చూసినా ఆడి, బీఎండబ్ల్యూ, రోల్స్‌ రాయిస్, రేంజ్ రోవర్ల కోలాహలం కనిపించనుంది. జైపూర్ విమానాశ్రయం నుంచీ ప్రముఖుల్ని తీసుకు వచ్చేందుకు అన్నీ ఇంపోర్టెడ్, కాస్ట్‌లీ కార్లే వాడనున్నారు!


విక్కీ, క్యాట్ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కి హై లెవల్ సెక్యూరిటీ కూడా సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారంతా వీఐపీలే కావటంతో వేడుకలు జరుగుతున్నంత సేపు 100 మంది బౌన్సర్లు కాపలా కాస్తుంటారట. ఇక వివాహ వేదికకి దగ్గర్లోనే ‘రణతంబోర్ పులుల కేంద్రం’ ఉండటంతో అతిథులకి టైగర్ సఫారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. పెళ్లికి ముందుగానీ, తరువాతగానీ సెలబ్రిటీ గెస్ట్స్ రాజస్థానీ పులుల్ని ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ ఉంటుంది. 


పెళ్లి అంటే ప్రధానమైన అంశాల్లో... భోజనం అత్యంత కీలకం! మరి ఆ సంగతేంటి? ప్రత్యేకమైన రాజస్థానీ రుచులు వచ్చిన వారికి మరిచిపోలేని గుర్తుగా మిగిలిపోతాయట. జైపూర్‌లోని ఓ ప్రముఖ క్యాటరింగ్ కంపెనీ ఇప్పటికే మెనూ సిద్ధం చేస్తోందని అంటున్నారు. చూడాలి మరి, కత్రీనా కైఫ్ కళ్యాణం దగ్గరపడుతోన్న కొద్దీ బాలీవుడ్‌లో ఈ వెడ్డింగ్ ఫీవర్ ఎంతగా ఎక్కువైపోతుందో! 

Updated Date - 2021-11-18T20:28:35+05:30 IST