విజిల్‌ వేయించే సాంగ్‌

ABN , First Publish Date - 2022-06-25T07:13:01+05:30 IST

రామ్‌ పోతినేని కథానాయకుడిగా నటి స్తున్న చిత్రం ‘ది వారియర్‌’. జులై 14న విడుదలవుతోంది. తెలుగు, తమిళభాషల్లో..

విజిల్‌ వేయించే సాంగ్‌

రామ్‌ పోతినేని కథానాయకుడిగా నటి స్తున్న చిత్రం ‘ది వారియర్‌’.  జులై 14న విడుదలవుతోంది. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో రామ్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘విజిల్‌’ సాంగ్‌ను హీరో సూర్య ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ ‘ఇది టిక్‌టాక్‌ సాంగ్‌ కాదు. థియేటర్‌ సాంగ్‌. విజిల్‌ వేసే బాధ్యత మీది.. వేయించాల్సిన బాధ్యత నాది. దేవి శ్రీ బ్లాక్‌బస్టర్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మాస్‌ కృతిని చూస్తారు’ అన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ ‘‘ఉప్పెన’ తర్వాత దేవి శ్రీ గారితో నేను చేస్తున్న చిత్రం ఇది. విజిల్‌ మహాలక్ష్మి కోసం ఒక సందర్భాన్ని క్రియేట్‌ చేసినందుకు లింగుస్వామి గారికి ధన్యవాదాలు’ అన్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. 

Updated Date - 2022-06-25T07:13:01+05:30 IST