The Warriorr : ట్విట్టర్ రివ్యూ ఇదే !

ABN , First Publish Date - 2022-07-13T21:30:32+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), ఉప్పెన (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) జోడీగా లింగుసామి (Lingusamy) మలిచిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది వారియర్’ (The Warrior). శ్రీశ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి (Adi Pinishetty) విలన్‌గా నటించాడు.

The Warriorr : ట్విట్టర్ రివ్యూ ఇదే !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), ఉప్పెన (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) జోడీగా లింగుసామి (Lingusamy) మలిచిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది వారియర్’ (The Warrior). శ్రీశ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి (Adi Pinishetty) విలన్‌గా నటించాడు. రామ్ కెరీర్‌‌లో తొలి పోలీస్ చిత్రం అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రేపే (జూలై 14) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే సినిమా అద్భుతంగా ఉందని ట్విట్టర్‌లో వార్తలు హోరెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ‘ది వారియర్’ చిత్రం టాక్ తో సోషల్ మీడియా మోతెక్కుతోంది.


ఇటీవల ‘ది వారియర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రం దాదాపు 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందట. చిత్రాన్ని తిలకించిన వెంటనే సెన్సార్ సభ్యుల నుంచి చిత్ర బృందానికి మంచి అప్లాజ్ లభించిందని వినికిడి. ఫస్టాఫ్ సూపర్ హిట్ అని.. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో , ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్..  సెకండాఫ్ ఊరమాస్ అని ట్వీట్ చేశారు. దర్శకుడిగా లింగుసామికిది బిగ్గెస్ట్ కమ్ బ్యాకని అంటున్నారు. హీరో రామ్ పోతినేని, విలన్ ఆదిపినిశెట్టి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు మాస్ ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయమని చెబుతున్నారు. 


సినిమాలో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని, ట్రైలర్ లో వాటిని రివీల్ చేయలేదు. సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ ను దాటేసి రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. గతేడాది రెడ్ సినిమాతో అభిమానుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన రామ్.. ‘ది వారియర్’ చిత్రంతో మరో ఇస్మార్ట్ హిట్ అందుకుంటాడని చెబుతున్నారు. మరి నిజంగానే ‘ది వారియర్’ చిత్రం ట్విట్టర్ రివ్యూలో చెప్పిన స్థాయిలో ఉంటుందా? లేక దాన్ని మించే రేంజ్ లో ఉంటుందా అనే విషయం తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-13T21:30:32+05:30 IST