The Warrior : ఓటీటీలోకి వచ్చేస్తోంది !

ABN , First Publish Date - 2022-08-07T17:40:02+05:30 IST

ఎనర్జిటిక్ స్టా్ర్ రామ్ (Ram), తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy) తొలి కలయికలో తెరకెక్కిన కాప్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’ (The Warrior). శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ (Chitturi Srinivas) నిర్మించారు.

The Warrior : ఓటీటీలోకి వచ్చేస్తోంది !

ఎనర్జిటిక్ స్టా్ర్ రామ్ (Ram), తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy) తొలి కలయికలో తెరకెక్కిన కాప్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’ (The Warrior). శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ (Chitturi Srinivas) నిర్మించారు. ఆది పినిశెట్టి (Adi Pinishetty) విలన్ గా నటించగా, నదియా, అక్షరగౌడ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందించారు. 


రామ్ తన కెరీర్‌లోనే తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించడం, దీనికి తోడు కృతిశెట్టి (Krithishetty) గ్లామర్ అపీరెన్స్ యాడ్ అవడంతో.. చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అయినప్పటికీ కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రొటీన్ కథాంశం, సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడంతో చిత్రానికి పరాజయం తప్పలేదు. ఇక ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు నిర్మాతలు.


ఆగస్ట్ 11న ‘ది వారియర్’ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కొన్ని చిత్రాలు థియేటర్స్‌లో సత్తాచాటనప్పటికీ.. ఓటీటీలో మంచి స్పందన దక్కించుకుంటాయి. అలాంటిదే ఈ చిత్రమని భావిస్తున్నారు. కాప్ యాక్షన్ చిత్రాలకు ఓటీటీలో మంచి రీచ్ ఉంటుంది. అందులోనూ రామ్ పోతినేని హీరో కాబట్టి.. ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకంటుందని చెప్పుకోవచ్చు. థియేటర్స్‌లో చూడని వారు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ‘ది వారియర్’ చిత్రం ఓటీటీలో అయినా.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుందేమో చూడాలి. 



Updated Date - 2022-08-07T17:40:02+05:30 IST