Ram Potineni: వారియర్స్‌లా నిలబడ్డారు

ABN , First Publish Date - 2022-07-16T21:29:02+05:30 IST

‘‘కరోనా భయం ఉన్నా, వర్షాలు పడుతున్నా, ఇతర సమస్యలు ఎదురవుతున్నా ప్రేక్షకులు మాత్రం థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్‌ అని ‘ది వారియర్‌’ మరోసారి నిరూపించింది. వర్షాభావ పరిస్థితుల వల్ల సినిమా వాయిదా వేయాలా? అనే ఆలోచనలో పడ్డాం. ప్రేక్షకులు వస్తారని మేం పెట్టుకున్న గట్టి నమ్మకమే.. ఈ సినిమాకు సక్సెస్‌కు కారణం’’ అని రామ్‌ పోతినేని అన్నారు.

Ram Potineni: వారియర్స్‌లా నిలబడ్డారు

‘‘కరోనా భయం ఉన్నా, వర్షాలు పడుతున్నా, ఇతర సమస్యలు ఎదురవుతున్నా ప్రేక్షకులు మాత్రం థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్‌ అని ‘ది వారియర్‌’ మరోసారి నిరూపించింది. వర్షాభావ పరిస్థితుల వల్ల సినిమా వాయిదా వేయాలా? అనే ఆలోచనలో పడ్డాం. ప్రేక్షకులు వస్తారని మేం   పెట్టుకున్న గట్టి నమ్మకమే.. ఈ సినిమాకు సక్సెస్‌కు కారణం’’ అని రామ్‌ పోతినేని అన్నారు. లింగుస్వామి (Lingu swami) దర్శకత్వంలో రామ్‌, కృతీశెట్టి (Kriti shetty)జంటగా శ్రీనివాస చిట్లూరి నిర్మించిన ‘ది వారియర్‌’ చిత్రం ఇటీవల విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.(RAm potineni)


రామ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా విడుదల సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వర్షాలు పడ్డాయి. డిజిటల్‌ ప్రింట్స్‌ గమ్యాన్ని చేరేవరకూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ సమయంలో మా టీమంతా వారియర్స్‌లా నిలబడ్డారు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. అదే మేం సాధించిన పెద్ద సక్సెస్‌. ఇదే నిర్మాతలతో మరో సినిమా చేస్తున్నా. అంత కంఫర్ట్‌ ఉన్న నిర్మాణ సంస్థ ఇది. లింగుస్వామి దగ్గర చాలా నేర్చుకున్నా. కృతి అందరికీ బేబీ అయిపోయింది. ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారు’’ అని అన్నారు.


దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి ప్రయత్నం సక్సెస్‌ కావడం ఆనందంగా ఉంది. ‘పందెం కోడి’, ‘ఆవారా’, ‘రన్‌’ చిత్రాలను ఎలా ఆదరించారో ఈ చిత్రాన్ని అలాగే రిసీవ్‌ చేసుకున్నారు. ఇదే ఎనర్జీతో మరిన్ని తెలుగు చిత్రాలు చేయాలనుకుంటున్నా. తమిళంలో విజయ్‌, అజిత్‌ లాంటి మాస్‌ హీరోలకు ఎలాంటి క్రౌడ్‌ వస్తుందో... అటువంటి మాస్‌ క్రౌడ్‌ మధ్య సినిమా చూశా. ఎక్కడైతే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్‌ అవుతారని అనుకున్నానో.. అక్కడే కనెక్ట్‌ అయ్యి విజిల్స్‌ వేశారు’’ అని అన్నారు.  


‘‘కమర్షియల్‌ సినిమాకు ఏం కావాలో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. వర్షాల్లో కూడా వసూళ్లు బావున్నాయి. ఈ బ్యానర్‌లో నా రెండో సినిమా ఇది. నేను పోషించిన గురు పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి. కమర్షియల్‌ సినిమాలకు ఆయన ల్యాండ్‌ మార్క్‌ దర్శకుడు’’ అని ఆది పినిశెట్టి చెప్పారు. కృతీశెట్టి, చిత్ర నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, సమర్పకులు పవన్‌ కుమార్‌, ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-16T21:29:02+05:30 IST