The Warrior : సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే !

ABN , First Publish Date - 2022-07-12T20:20:57+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), ‘ఉప్పెన’ (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithishetty) జంటగా నటించిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ది ‘వారియర్’ (The Warrior). లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో శ్రీశ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) చిత్రాన్ని నిర్మించారు.

The Warrior : సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), ‘ఉప్పెన’ (Uppena) బ్యూటీ కృతిశెట్టి (Krithishetty) జంటగా నటించిన కాప్ యాక్షన్ థ్రిల్లర్ ది ‘వారియర్’ (The Warrior). లింగుసామి (Lingusamy) దర్శకత్వంలో శ్రీశ్రీనివాస సిల్వర్ స్ర్కీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి (Srinivas Chitturi) చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా సింగిల్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ‘ది వారియర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సా్ర్ వారు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ఈ సినిమాకి 155 నిమిషాల ప్రదర్శనా సమయాన్ని ఫిక్స్ చేశారు. అంటే దాదాపు 2 గంటల 35 నిమిషాలన్నమాట. 


అల్లు అర్జున్ ‘సరైనోడు’ (Sarainodu) చిత్రం తర్వాత ఆది పినిశెట్టి (Adi Pinishetty) విలన్ గా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో రామ్, ఆదిల పై వచ్చే సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. రన్ (Run), పందెంకోడి (Pandem Kodi), ఆవారా (Awara) చిత్రాలతో తెలుగు వారిని కూడా అలరించిన దర్శకుడు లింగుసామి.. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాతో రామ్ తమిళ ప్రేక్షకులకు కూడా అభిమాన హీరో అవుతాడని మేకర్స్ చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకున్న ‘ది వారియర్’ చిత్రానికి ఓ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. 


ఏపీ, తెలంగాణ, కర్నాటక , ఓవర్సీస్, తమిళ భాషలతో కలుపుకొని ది వారియర్ చిత్రం మొత్తం రూ. 43. 10 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. రామ్ 19వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ‘రెడ్’ (Red) చిత్రంతో అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన రామ్.. ఈ సినిమాతో కచ్చితంగా మాస్ ట్రీట్ ఇస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో రామ్ పోతినేని ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 

Updated Date - 2022-07-12T20:20:57+05:30 IST