The Warrior: డిజిటల్ రైట్స్ వారికేనా..?

ABN , First Publish Date - 2022-07-15T15:43:42+05:30 IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni ), కృతి శెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ (The Warriorr) ‘ది వారియర్’.

The Warrior: డిజిటల్ రైట్స్ వారికేనా..?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni ), కృతి శెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ (The Warriorr) ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించారు. కోలీవుడ్ దర్శకుడు లింగు సామి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


భారీ అంచనాలు మధ్య ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ పార్ట్‌నర్‌పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. ది వారియర్ థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రానుంది. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టెలివుజన్ సంస్థ స్టార్ మా దక్కించుకుంది. 


ఇక ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదలైంది. ది వారియర్ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సస్‌లో భారీ స్థాయిలో విడుదల చేశారు. తెలంగాణ (నైజాం)లో 250 పైగా థియేటర్స్.. రాయలసీమ (సీడెడ్)లో 145 + ఆంధ్ర ప్రదేశ్ 300 + తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి 700 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఒక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + తమిళనాడు కలిపి 230 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఇక ఓవర్సీస్‌లో 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్స్‌లో ’ది వారియర్’ మూవీ విడుదలైనట్టు సమాచారం.

Updated Date - 2022-07-15T15:43:42+05:30 IST