‘ఆ దేశ’ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న ‘The Kashmir Files’ డైరెక్టర్...

ABN , First Publish Date - 2022-03-30T03:05:52+05:30 IST

‘ద కాశ్మీర్ ఫైల్స్’ అనూహ్య విజయం దేశంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి చిత్రం దేశ సరిహద్దులు దాటి విదేశాల్లో కూడా కదలిక తీసుకొస్తోంది. లండన్‌లోని...

‘ఆ దేశ’ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న ‘The Kashmir Files’ డైరెక్టర్...

‘ద కాశ్మీర్ ఫైల్స్’ అనూహ్య విజయం దేశంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి చిత్రం దేశ సరిహద్దులు దాటి విదేశాల్లో కూడా కదలిక తీసుకొస్తోంది. లండన్‌లోని యూనైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు మాట్లాడబోతున్నారు! 


కాశ్మీరీ పండిట్ల దయనీయ స్థితిని, విషాద పరిస్థితిని వివరించేందుకు వివేక్ అగ్నిహోత్రికి చారిత్రక అవకాశం లభించింది. బ్రిటన్ పార్లమెంట్‌లో ఆయన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా వెనుక దాగున్న అసలు కథని అక్కడి ప్రజా ప్రతినిధులకి వివరించనున్నారు. వచ్చే నెలలో తన భార్య, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ నటి పల్లవి జోషితో పాటూ లండన్‌ వెళ్లనున్నట్టు వివేక్ వెల్లడించారు. ‘‘కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ మారణకాండని ప్రపంచంలోని ప్రతీ మూలకి తీసుకెళ్లటం కోసమే ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా రూపొందించాం. అది ఇప్పుడు సాధ్యమవుతోన్నందుకు సంతోషంగా ఉంది...’’ అంటున్నారు అగ్నిహోత్రి. వచ్చే నెలలో బ్రిటన్ పార్లమెంట్లో ఆయన ప్రసంగం ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు... 

Updated Date - 2022-03-30T03:05:52+05:30 IST