టికెట్‌ వంద రూపాయలే!

ABN , First Publish Date - 2022-09-26T06:33:26+05:30 IST

పెరిగిన టికెట్‌ రేట్లు, ఓటీటీల ఉధృతి వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న విషయాన్ని నిర్మాతలు గ్రహిస్తున్నారు....

టికెట్‌ వంద రూపాయలే!

‘బ్రహ్మాస్త్ర’ దసరా ఆఫర్‌

పెరిగిన టికెట్‌ రేట్లు, ఓటీటీల ఉధృతి వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న విషయాన్ని నిర్మాతలు గ్రహిస్తున్నారు. అందుకే టికెట్‌ రేట్లు తగ్గించి, ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నేషనల్‌ సినిమా డే’ని పురస్కరించుకొని, ఇటీవల సినిమా టికెట్‌ రూ.75లకే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నం మంచి ఫలితాల్ని ఇచ్చింది. టికెట్‌ రేటు తగ్గించడంతో భారీగా థియేటర్లకు కదిలి వచ్చారు ప్రేక్షకులు. దాంతో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ మరో ఆఫర్‌ ప్రకటించింది. నవరాత్రుల సందర్భంగా సెప్టెంబరు 26 నుంచి 29 వరకూ అన్ని మల్టీప్లెక్సులలోనూ సినిమా టికెట్‌ రూ.100కే అందిస్తామని వెల్లడించింది. దాంతో ‘బ్రహ్మాస్త్ర’కు మరిన్ని వసూళ్లు అందుతాయని భావిస్తున్నారు. రణబీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సెప్టెంబరు 9న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకూ దాదాపుగా రూ.300 కోట్ల మేర వసూళ్లు లభించాయి. 2డీ, 3డీ, ఐమాక్స్‌ 3డీలలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ దసరా ఆఫర్‌తో కనీసం మరో రూ.50 కోట్లయినా రాబట్టాలన్నది నిర్మాతల ప్లాన్‌. తెలుగు చిత్రాలు కూడా ఇలాంటి స్కీములతో వస్తాయేమో చూడాలి. 

Updated Date - 2022-09-26T06:33:26+05:30 IST