సమాజానికో ప్రశ్న

Twitter IconWatsapp IconFacebook Icon
సమాజానికో ప్రశ్న

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం, ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ఐశ్వర్య జంటగా సిద్దార్థ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ‘దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకటరమణ ఈ సినిమాకు దర్శకుడు. చిత్రం గురించి ఆయన వివరిస్తూ ‘ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని భారత రాజ్యంగంలోని ఆర్టికల్‌ 20 చెబుతోంది. కానీ దానికి భిన్నంగా నేటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మారాలి, ఆర్టికల్‌ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలి అని చెప్పే చిత్రమిది. ఇందులో ఓ విభిన్న ప్రేమకథను కూడా చూపిస్తున్నాం’ అని తెలిపారు. చిత్ర నిర్మాత సిద్ధార్థ హరియాల మాట్లాడుతూ ‘సమాజాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే సినిమా ఇది. ఈ నెల 25న షూటింగ్‌ ప్రారంభించి కాకినాడ, యానాం, హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తాం’ అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి తదితరులు నటించే ఈ చిత్రానికి మాటలు: సురేశ్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: జి. అమర్‌, సమర్పణ: వేదుల బాలకామేశ్వరి, నిర్మాతలు: సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.