సామాన్యుడి సన్నద్దం

ABN , First Publish Date - 2022-01-30T06:50:32+05:30 IST

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్‌ హయతి కథానాయిక. పా.శరవణన్‌ దర్శకత్వం వహించారు...

సామాన్యుడి సన్నద్దం

విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్‌ హయతి కథానాయిక. పా.శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ సామాజిక ఇతివృత్తాన్ని పూర్తిగా కమర్షియల్‌ కోణంలో చెప్పిన కథ ఇది. ఓ సామాన్యుడు తలచుకుంటే ఏం చేయగలడో చూపించాం. కథ, కథనం, యాక్షన్‌ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. యోగిబాబు కామెడీ థియేటర్లో నవ్వులు పంచుతుంద’’న్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కవిన్‌ రాజ్‌, కూర్పు: ఎన్‌.బి.శ్రీకాంత్‌. 


Updated Date - 2022-01-30T06:50:32+05:30 IST