ముహూర్తం కుదిరింది!

ABN , First Publish Date - 2022-05-26T06:42:48+05:30 IST

వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న ‘సీతారామం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా...

ముహూర్తం కుదిరింది!

వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న ‘సీతారామం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నారు. మృణాళిని ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి.. ఆగస్ట్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ చెప్పారు. సుమంత్‌, గౌతమ్‌ మీనన్‌, ప్రకాశ్‌రాజ్‌, తరుణ్‌ భాస్కర్‌, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గీతా గౌతమ్‌. 


Updated Date - 2022-05-26T06:42:48+05:30 IST