అమెరికాలో అందాల వేడుక... రంగురంగుల Met Gala ఫ్యాషనోత్సవానికి రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2022-05-03T01:24:10+05:30 IST

ప్రపంచ ఫ్యాషన్ రంగపు అత్యంత ప్రధానమైన వేడుకగా భావించే ‘మెట్ గాలా’ మళ్లీ వచ్చేసింది. రంగురంగుల అందాల్ని ఆవిష్కరించేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం రంగం సిద్దం చేసుకుంది. అయితే, ఫ్యాషన్ రంగంలోని వారికి మెట్ గాలా ఎంత ఇష్టమో... సామాన్య జనాలకి కూడా అందాల వేడుక అంతే ఇష్టం. కారణం... రెడ్ కార్పెట్ పై రొటీన్ కి భిన్నంగా హొయలుపోయే సుందరీమణులు. బోలెడన్ని అల్లికలు, మెలికలతో తళుకులీనే... వారి వస్త్రాల మాటు వయ్యారాలు...

అమెరికాలో అందాల వేడుక... రంగురంగుల Met Gala ఫ్యాషనోత్సవానికి రంగం సిద్ధం!

ప్రపంచ ఫ్యాషన్ రంగపు అత్యంత ప్రధానమైన వేడుకగా భావించే ‘మెట్ గాలా’ మళ్లీ వచ్చేసింది. రంగురంగుల అందాల్ని ఆవిష్కరించేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరం రంగం సిద్దం చేసుకుంది. అయితే, ఫ్యాషన్ రంగంలోని వారికి మెట్ గాలా ఎంత ఇష్టమో... సామాన్య జనాలకి కూడా అందాల వేడుక అంతే ఇష్టం. కారణం... రెడ్ కార్పెట్ పై రొటీన్ కి భిన్నంగా హొయలుపోయే సుందరీమణులు. బోలెడన్ని అల్లికలు, మెలికలతో తళుకులీనే... వారి వస్త్రాల మాటు వయ్యారాలు... మెట్ గాలా తరువాత చాలా రోజులే చర్చగా కొనసాగుతుంటాయి. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే లాంటి మన దేసీ బ్యూటీస్ కూడా ఈ బిగ్గెస్ట్ ఫ్యాషన్ నైట్ రెడ్ కార్పెట్ పై మిలమిల మెరిశారు!


మెట్ గాలా కేవలం అందాలు, అందమైన దుస్తుల ప్రదర్శన మాత్రమే కాదు. ప్రతీ ఏటా ఈ సంబరానికి ఓ థీమ్ ఉంటుంది. ఆ అంశాన్ని ఆసారాగా చేసుకునే అంతర్జాతీయ అందగత్తెలు తమ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకుంటారు. థీమ్ ని రిఫ్లెక్ట్ చేసేలా అత్యంత విశేషమైన, కొన్నికొన్ని సార్లు... అత్యంత విస్మయకరమైన వస్త్రాలు అలంకరించుకుంటారు! అదే మెట్ గాలా అసలు హైలైట్... 


‘ఇన్ అమెరికా : యాన్ ఆంథాలజీ ఆప్ ఫ్యాషన్’ ... ఈ సారి మెట్ గాలా థీమ్. ఇంతకీ దాని అర్థం ఏంటి అంటారా? ‘అమెరికన్ స్టైల్’ ఎదుగుదలని ప్రతిబింబించటమే ఈ సంవత్సరం వేడుకల్లో ప్రత్యేకత. అమెరికన్ ఫ్యాషన్ అనే దాన్ని ఇప్పుడున్న స్థాయికి తేవటంలో టైలర్లు, డ్రెస్ మేకర్స్, డిజైనర్స్ ఎందరెందరో చేసిన సేవల్ని స్మరించుకోనున్నారు... 


మెట్ గాలా థీమ్ ‘ఇన్ అమెరికా : యాన్ ఆంథాలజీ ఆప్ ఫ్యాషన్’ రెడ్ కార్పెట్ మీద ఎలా ప్రతిబింబిస్తుంది? హాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ సెలబ్రిటీస్... అందాల వేడుకలో అలనాటి దుస్తులతో అలజడి సృష్టించనున్నారు. రాజుల కాలం నాటి వస్త్రాలు మొదలు దశాబ్దాల కాలం కిందటి రెట్రో ఔట్ ఫిట్స్ వరకూ ఎన్నెన్నో చూపరుల్ని మెస్మరైజ్ చేయనున్నాయి. అయితే, జిగేలుమనే అలంకారాల్లో ఏయే అందగత్తెలు ఎర్ర తివాచీపైకి అరుదెంచుతారు అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మెట్ గాలా 2022 సెలబ్రిటీ లిస్ట్ సస్పెన్స్ గా ఉంచారు. ఈ సారి ఇండియా నుంచీ ఎవరైనా హాజరవుతారో లేదో చూడాలి మరి... 

Updated Date - 2022-05-03T01:24:10+05:30 IST