Happy Independence Day: ‘షేర్ షా’ నుంచి ‘మేజర్’ వరకు ప్రేక్షకుల్లో దేశభక్తిని ప్రేరేపించే సినిమాలివే

ABN , First Publish Date - 2022-08-15T21:48:51+05:30 IST

ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యవం వచ్చింది. నేడు భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటుంది. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి

Happy Independence Day: ‘షేర్ షా’ నుంచి ‘మేజర్’ వరకు ప్రేక్షకుల్లో దేశభక్తిని ప్రేరేపించే సినిమాలివే

ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. నేడు భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటుంది. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఫిల్మ్ మేకర్స్ సినిమాలను రూపొందిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా అందరిలో దేశభక్తిని ప్రేరేపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దామా.. 


షేర్‌షా (Shershaah): 

సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. 


మేజర్ (Major):

ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబైపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ప్రాణాలను అర్పించాడు. అతడి జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అడివి శేష్ హీరోగా నటించాడు. శశి కిరణ తిక్కా దర్శకత్వం వహించాడు. 


ఆర్ఆర్ఆర్ (RRR): 

దర్శక ధీరుడు యస్‌యస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రలు పోషించారు. 1920ల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో దేశ భక్తిని పెంపొందించే ఎన్నో సన్నివేశాలున్నాయి. 


రంగ్ దే బసంతి (Rang de Basanti):

రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించాడు. ఆమిర్ ఖాన్, షర్మాన్ జోషి, సిద్దార్థ్, అతుల్ కులకర్ణి, కునాల్ కపూర్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్ర‌శేఖర్ ఆజాద్ పాత్రల్లో కనిపించారు. 


చక్ దే ఇండియా (Chak De India):

మహిళల హాకీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. షారూఖ్ ఖాన్ హీరోగా నటించాడు. షిమ్మిత్ అమిన్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. బెస్ట్ పాపులర్ మూవీగా ఈ చిత్రం నేషనల్ అవార్డు గెలుచుకుంది. 


Updated Date - 2022-08-15T21:48:51+05:30 IST