The Kashmir Files: ఆస్కార్స్‌కి వెళితే దేశానికి అవమానం.. సూపర్ హిట్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

ABN , First Publish Date - 2022-08-18T17:35:42+05:30 IST

కొందరూ ప్రముఖుల, సినీ స్టార్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరగడం మామూలే. అలా ఇప్పటికే చాలామంది మధ్య..

The Kashmir Files: ఆస్కార్స్‌కి వెళితే దేశానికి అవమానం.. సూపర్ హిట్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

కొందరూ ప్రముఖుల, సినీ స్టార్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరగడం మామూలే. అలా ఇప్పటికే చాలామంది మధ్య అలాంటి ట్వీట్ల వార్ జరిగింది. ఇంతకుముందు కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ మధ్య అలాంటి వారే జరిగింది. తాజాగా ఇద్దరూ బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) మధ్య ప్రస్తుతం వివాదం నడుస్తోంది.


అనురాగ్ కొత్త సినిమా ‘దోబారా’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)’పై వ్యాఖ్యలు చేశాడు. ఇండియా తరుఫున ఆ సినిమా ఆస్కార్స్‌కి వెళ్లే అవకాశం లేదని అనురాగ్ చెప్పాడు. దానిపై ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. అనురాగ్ ఇంటర్వ్యూని ట్వీట్ చేసిన వివేక్.. ‘ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఆస్కార్స్‌కి వెళ్లకుండా నరమేధాన్ని ఒప్పుకొని బాలీవుడ్ ప్రముఖులు క్యాపెయిన్‌ని ప్రారంభించారు. అది కూడా దోబారా సినిమా తీసే ఆయన నాయకత్వంలో చేస్తున్నారు’ అని వెటకారంగా రాసుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మరో దర్శకుడు స్సందించాడు.


నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీ సిరీస్ ‘బ్యాడ్ బోయ్ బిలియనీర్స్’‌తో గుర్తింపు పొందిన దర్శకుడు డైలన్ మోహన్ గ్రే. ఆయన అనురాగ్ కౌంటర్‌గా వివేక్ పెట్టిన ట్వీట్‌పై స్పందించాడు. మోహన్ చేసిన ట్వీట్‌‌కి.. ‘అవును, వాస్తవానికి ఆ సినిమా (ద్వేషపూరిత, రివిజనిస్ట్) కళాత్మక యోగ్యత లేని చెత్త. ఒకవేళ తటస్థ బోర్డు గనుగ ఈ సినిమాని ఆస్కార్స్‌కి ఎంపిక చేస్తే.. అక్కడ భారత దేశానికి ఇబ్బందిగా అవమానం అవుతుంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ఉన్న మంచిపేరుని కాపాడడానికి అనురాగ్ కశ్యప్ అలా చెప్పాడు’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-08-18T17:35:42+05:30 IST