బాలీవుడ్ బరిలో ‘RRR’పై ‘The Kashmir Files’దే విజయం!

ABN , First Publish Date - 2022-04-11T23:26:39+05:30 IST

కరోనా వచ్చి వెళ్లాక థియేటర్లు నెమ్మదిగా, నీరసంగా తెరుచుకున్నాయి. మహమ్మారి సోకిన పేషెంట్స్ ఎలాగైతే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారో... బాక్సాఫీస్ కూడా చాలా రోజులు అలాగే ఊసూరుమంటూ కొనసాగింది. కానీ, 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఒక స్మాల్ బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ జోష్ తీసుకొచ్చింది. అదే ‘ద కాశ్మీర్ ఫైల్స్’!

బాలీవుడ్ బరిలో ‘RRR’పై ‘The Kashmir Files’దే విజయం!

కరోనా వచ్చి వెళ్లాక థియేటర్లు నెమ్మదిగా, నీరసంగా తెరుచుకున్నాయి. మహమ్మారి సోకిన పేషెంట్స్ ఎలాగైతే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారో... బాక్సాఫీస్ కూడా చాలా రోజులు అలాగే ఊసూరుమంటూ కొనసాగింది. కానీ, 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఒక స్మాల్ బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ జోష్ తీసుకొచ్చింది. అదే ‘ద కాశ్మీర్ ఫైల్స్’!


విడుదలైన రోజు నుంచీ మౌత్ టాక్‌తో దావనలంలా వ్యాపించిన ‘కాశ్మీర్ ఫైల్స్’ విజయం... పోస్ట్ కోవిడ్ ఎరాలో బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పుతోంది. డొమెస్టిక్ కలెక్షన్స్‌లో 250 కోట్ల మార్కుని దాటేసింది! ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకున్న వివేక్ అగ్నిహోత్రి చిత్రం అయిదవ వారంలోనూ... శుక్రవారం 50 లక్షలు, శనివారం 85 లక్షలు, ఆదివారం 1.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ తాజా వసూళ్లతో ‘కాశ్మీర్ ఫైల్స్’ భారతదేశ రాబడి 250.73 కోట్లుగా నమోదైంది. 


ఒకవైపు 15 కోట్ల చిరుబడ్జెట్‌తో రూపొందిన అనుపమ్ ఖేర్, పల్లవి జోషీ స్టారర్ ‘కాశ్మీర్ ఫైల్స్’ 250 కోట్ల మైలురాయి దాటేస్తే... రాజమౌళి మల్టీ క్రోర్, మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ 200 కోట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ, తెలుగు, తమిళం వంటి అన్ని భాషల వర్షన్స్‌ని కలిపితే ‘కాశ్మీర్ ఫైల్స్’ కంటే ఎక్కువే సాధించింది. కానీ, ‘టీకేఎఫ్’ ఓన్లీ హిందీ మూవీనే కాబట్టి దానితో హిందీ వర్షన్ ‘ఆర్ఆర్ఆర్’ని పొలిస్తే దాదాపు 50 కోట్ల వసూళ్లు రాజమౌళి చిత్రానికి తక్కువగా ఉన్నాయి. 


‘కాశ్మీర్...’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల కంటే ముందు అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ నెలకొల్పింది. ప్యాండమిక్ లాక్ డౌన్స్ ముగిశాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్దకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా 293 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ‘ద కాశ్మీర్ ఫైల్స్’ వరల్డ్ వైడ్‌గా 337.23 కోట్లు స్వంతం చేసుకుంది. అయితే, ఓవర్ సీస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు ఆల్రెడీ 1029 కోట్లు దాటిపోయాయి. కానీ, ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్‌ సక్సెస్‌లో తెలుగు, తమిళ వర్షన్స్ రాబట్టిన డబ్బులే ఎక్కువట! ‘కాశ్మీర్ ఫైల్స్’ ఓన్లీ హిందీ వర్షన్‌తోనే 300 కోట్ల మార్కుని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాటేసింది! 


చిన్న సినిమాగా, పెద్ద పబ్లిసిటీ లేకుండా... చినుకులా వచ్చి ఉప్పెనైపోయిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’... ‘ఆర్ఆర్ఆర్’ లాంటి హైప్ సంపాదించుకున్న మూవీ కంటే నిజంగా గ్రేట్ అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. తాజా కలెక్షన్లు చూస్తే ఆర్జీవీ మాట నిజమేననక తప్పదు మరి...                                                            

Updated Date - 2022-04-11T23:26:39+05:30 IST