వారంలో... వంద! 7 రోజుల్లొ 'The Kashmir Files' 107 కోట్ల రికార్డ్!

ABN , First Publish Date - 2022-03-19T01:58:12+05:30 IST

చిన్న సినిమాగా మొదలై... కాశ్మీరు నుంచీ కన్యాకుమారి దాకా సంచలనం సృష్టిస్తోంది ‘ద కాశ్మీర్ ఫైల్స్’. దేశం లోపలే కాదు వెలుపల కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆశ్చర్యకర రీతిలో వసూళ్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి ఏడు రోజుల్లోనే...

వారంలో... వంద! 7 రోజుల్లొ 'The Kashmir Files' 107 కోట్ల రికార్డ్!

చిన్న సినిమాగా మొదలై... కాశ్మీరు నుంచీ కన్యాకుమారి దాకా సంచలనం సృష్టిస్తోంది ‘ద కాశ్మీర్ ఫైల్స్’. దేశం లోపలే కాదు వెలుపల కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆశ్చర్యకర రీతిలో వసూళ్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి ఏడు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటేసింది!


‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన తమ సినిమా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్స్‌ సాధిస్తోందంటూ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఏడు రోజుల్లోనే 106.80 కోట్లు వసూలు చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.  అంతే కాదు, ‘‘మా చిత్రం ‘ద కాశ్మీర్ ఫైల్స్’ తన అసలైన రంగుల్ని వెదజల్లుతోంది! హ్యాపీ హోలీ అందరికీ!’’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు అనుపమ్...  


1990లో కాశ్మీరీ పండిట్లపై లోయలో జరిగిన అమానుష దాడుల్ని ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించారు. ఆనాటి అమానుషాన్ని చూస్తున్న వారంతా థియేటర్స్‌లో ఎమోషనల్ అవుతున్నారు. దాంతో మౌత్ టాక్ ఉధృతంగా లభిస్తోంది. 600 పైచిలుకు థియేటర్లలో తొలి రోజు విడుదలైన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ వారం తిరిగే సరికల్లా 4 వేల స్క్రీన్స్‌లో ప్రదర్శితం అవుతోంది. అంచనాలకు మించి వందల కోట్ల వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది... 

Updated Date - 2022-03-19T01:58:12+05:30 IST