Vivek Agnihotri: ‘కాఫీ క్లబ్’ అంటూ రణ్‌బీర్, కరణ్‌లపై విమర్శలు

ABN , First Publish Date - 2022-09-10T00:25:47+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లో భిన్నమైన వాడు వివేక్ అగ్ని హోత్రి (Vivek Agnihotri). ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) కు దర్శకత్వం సాధించి బంపర్ హిట్ కొట్టాడు. తాజాగా వివేక్‌కు సంబంధించిన ఓ వీడియో

Vivek Agnihotri: ‘కాఫీ క్లబ్’ అంటూ రణ్‌బీర్, కరణ్‌లపై విమర్శలు

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లో భిన్నమైన వాడు వివేక్ అగ్ని హోత్రి (Vivek Agnihotri). ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) కు దర్శకత్వం సాధించి బంపర్ హిట్ కొట్టాడు. తాజాగా వివేక్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో బీఫ్ తినడంపై అతడు చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. దీంతో వివేక్‌ను కొంత మంది ట్రోల్ చేయడం ప్రారంభించారు. విమర్శల వర్షం కురిపించారు. ఫలితంగా అతడు స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. రణ్‌బీర్ కపూర్, కరణ్ జోహార్‌లపై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. ‘‘కాఫీ క్లబ్‌కు చెందిన కొంత మంది తమ సినిమాపై దృష్టి సారించకుండా నాతో పోరాడాలని సోషల్ మీడియా ఏజెన్సీ, పీఆర్‌టీమ్స్‌ని కోరుతున్నారు. కాఫీ హ్యాంపర్స్‌తో మీరు నన్ను ఆకట్టుకోలేరు. నేను అటువంటి మనిషిని కాదు’’ అని వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్స్ షేర్ చేయడం మొదలుపెట్టారు. 


గతంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తాను బిగ్ భీప్ బాయ్ అని చెప్పుకొన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అనేక మంది నెటిజన్స్ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. కాసేపటికే వివేక్ అగ్నిహోత్రి వీడియో కూడా నెట్టింట హల్‌‌చల్ చేయడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వివేక్ పోస్ట్ పెట్టాడు. ‘బ్రహ్మాస్త్ర’ కు కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘కాఫీ విత్ కరణ్’ అనే చాట్ షోను కూడా అతడు హోస్ట్ చేస్తున్నాడు. అందువల్ల రణ్ బీర్ కపూర్, కరణ్ జోహార్‌లను పరోక్షంగా ‘కాఫీ క్లబ్’ అని అభివర్ణించాడు.

Updated Date - 2022-09-10T00:25:47+05:30 IST