Vivek Agnihotri: ఆమీర్‌ఖాన్ మోసం చేస్తున్నారు.. బాలీవుడ్ స్టార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

ABN , First Publish Date - 2022-09-04T16:57:05+05:30 IST

‘ది కాశ్మీర్ ఫైల్స్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ దర్శకుడు ఇటీవల కాలంలో జరుగుతున్న...

Vivek Agnihotri: ఆమీర్‌ఖాన్ మోసం చేస్తున్నారు.. బాలీవుడ్ స్టార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

‘ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ఈ దర్శకుడు ఇటీవల కాలంలో జరుగుతున్న పలు అంశాలపై చాలా అగ్రెసివ్‌గా స్పందిస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తాజాగా సైతం బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’పై స్పందించాడు.


దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య ముఖ్యపాత్రలో నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం చాలా దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. దాంతో.. పెట్టిన బడ్జెట్‌ సగం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివేక్ మాట్లాడుతూ ఆమీర్ ఖాన్‌పై విమర్శలు చేశాడు.


వివేక్ మాట్లాడుతూ.. ‘బహిష్కరణ ప్రభావం ఆమీర్ ఖాన్ సినిమా మీద ఉందని నేను అనుకోట్లేదు. నిజానికి ఆమీర్‌లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే అలా జరిగింది. ఆమీర్ ఖాన్ అర్థం చేసుకుంటారని ఇది చెబుతున్నాను. లాల్ సింగ్ చడ్డాని ఉదాహరణగా తీసుకుంటే భక్తులు సినిమాను ధ్వంసం చేశారు. ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పుకుంటారు కదా. నరేంద్ర మోదీకి గత ఎలక్షన్లలో 40 శాతం మాత్రమే ఓట్టు వచ్చాయి. అంటే ఆయన అభిమానుల్లో 50 శాతం మందిని తీసేసినా.. మిగిలిన 50 శాతం మంది ఎక్కడికి పోయారు. సినిమాని ఎందుకు చూడలేదు. అంటే.. ఆయనకి అభిమానులు లేరని నా అభిప్రాయం. 


అంటే ఆయన చెప్పేదంతా భోగస్, మోసం. నీకు ప్రత్యేక అభిమానుల లేనప్పుడు ఒక్కో సినిమాకి ఎందుకు రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు చేయిస్తారు. మీకు ఓ విషయం చెప్పాలి. దంగల్, పద్మావత్ విడుదల సమయంలో బాయ్‌‌కాట్ అనేది చాలా ఘోరంగా ఉంది. కానీ.. ఆ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డుల గురించి తెలిసిందే. ముఖ్యంగా దంగల్‌ సినిమాకి వస్తే ప్రేక్షకులు ఆమీర్‌లో ఓ నిజాయతీని చూశారు. అది లాల్ సింగ్ చడ్డాలో కనిపించలేదు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-09-04T16:57:05+05:30 IST