బాలీవుడ్ నటిని ఎద్దేవా చేసిన The Kashmir Files దర్శకుడు

ABN , First Publish Date - 2022-07-01T22:07:33+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ దియా మీర్జా(Dia Mirza). ‘సంజు’, ‘థప్పడ్’, ‘వైల్డ్ డాగ్’ వంటి సినిమాలతో అభిమానులను అలరించించారు.

బాలీవుడ్ నటిని ఎద్దేవా చేసిన The Kashmir Files దర్శకుడు

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ దియా మీర్జా(Dia Mirza). ‘సంజు’, ‘థప్పడ్’, ‘వైల్డ్ డాగ్’ వంటి సినిమాలతో అభిమానులను అలరించించారు. తాజాగా ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమెను బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ఎద్దేవా చేశారు. 


రాజకీయ పరిణామాల కారణంగా మహారాష్ట్ర‌ ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు అందించిన సేవలకు గాను ఉద్ధవ్ థాకరేకు కృతజ్ఞతలు చెబుతూ బాలీవుడ్ నటి దియా మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ప్లానెట్‌‌తో పాటు ప్రజలను బాగా చూసుకున్నారు. అందుకే ఇక్కడ కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ దేశానికి సేవ చేసేందుకు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ ఉద్ధవ్ థాకరే’’ అని దియా మీర్జా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రిప్లై ఇచ్చారు. ‘‘ఏ ప్లానెట్..? ప్టానెట్ బాలీవుడా..?’’ అని వివేక్ వ్యంగ్యాస్త్రం సంధించారు. మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) కూడా కొత్త సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆటో రిక్షా నడపడం నుంచి, దేశంలోనే శక్తిమంతమైన వ్యక్తిగా ఎదిగారు. మీ ప్రయాణం స్ఫూర్తిమంతం సార్. మీకు శుభాకాంక్షలు’’ అని కంగన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దియా మీర్జా ప్రస్తుతం ‘ధక్ ధక్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజన సంఘీ, ఫాతిమా సనా షేక్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 



Updated Date - 2022-07-01T22:07:33+05:30 IST