Congress : Kangana అలా మాట్లాడటం... దేశద్రోహమే!

ABN , First Publish Date - 2021-11-21T18:44:50+05:30 IST

కాంట్రవర్సికి ఫేవరెట్ చైల్డ్... కంగనా! ఆమె మరోసారి పోలీస్ కంప్లైంట్‌లో పేరు సంపాదించుకుంది. ఈ మధ్య ఆమె మీద వరుసగా ఎఫ్ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి.

Congress : Kangana అలా మాట్లాడటం... దేశద్రోహమే!

కాంట్రవర్సికి ఫేవరెట్ చైల్డ్... కంగనా! ఆమె మరోసారి పోలీస్ కంప్లైంట్‌లో పేరు సంపాదించుకుంది. ఈ మధ్య ఆమె మీద వరుసగా ఎఫ్ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి. 2014లో మనకు అసలు స్వాతంత్ర్యం వచ్చిందంటూ అగ్గి రాజేసిన రనౌత్ ఎంతో మందికి టార్గెట్‌గా మారింది. తాజాగా ఆమె సాగు చట్టాల రద్దుపై స్సందన తెలియజేసింది. అది కూడా ఇఫ్పుడు పోలీస్ కంప్లైంట్‌కి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కంగనా సొషల్ మీడియా పోస్టుని తప్పుబడుతూ ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కింది...
 
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం...  ద ఇండియన్ యూత్ కాంగ్రెస్(ఐవైసి)... కంగనా మాటలు దేశద్రోహం కిందకి వస్తాయంటోంది. యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ అమరీశ్ రంజన్ పాండే, మరో నేత అంబుజ్ దీక్షిత్ ఆమెపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. వారు కేసు నమోదు చేయటానికి కారణం... ప్రధాని మోదీ వివాదాస్పద సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాక, కంగనా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీసే. శుక్రవారం నాడు ఆమె, మోదీ తాజా నిర్ణయంపై, తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన జనం ఇలా చట్టాల్ని అడ్డుకుంటూ ఉంటే మనది కూడా ‘జిహాదీ’ దేశంగా మారుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.  మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దేశం తగిన స్థితిలో లేనప్పుడు నియంతృత్వమే సరైంది అంటూ కామెంట్ చేశారు.   

కంగనా రనౌత్ డిక్టేటర్‌షిప్ మంచిదని చెప్పటం ప్రమాదకరం అంటున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఆమెకు సొషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉందనీ, ఆమె వల్ల ఎందరో ప్రభావితం అవుతారని వారంటున్నారు. కాబట్టి ఆమె ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వాన్ని సమర్థించటం దేశద్రోహం అవుతుందని కాంగ్రెస్ నాయకులు తమ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. కంగనా మాటలు ద్వేషపూరితం అని కూడా వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్‌పై కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో మరి!

Updated Date - 2021-11-21T18:44:50+05:30 IST