నిన్న షాహిద్, ఇప్పుడు అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్... బాలీవుడ్ హీరోలకు Yash వడదెబ్బ!

ABN , First Publish Date - 2022-05-02T00:11:08+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘రాకీ భాయ్’ రాకింగ్ పర్ఫామెన్స్ కొనసాగుతూనే ఉంది. మూడో వారంలోనూ స్ట్రెయిట్ హిందీ మూవీస్ ని ‘కేజీఎప్ చాప్టర్ 2’ పూర్తిగా డామినేట్ చేస్తోంది. తాజాగా యశ్ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ 350 కోట్ల మార్క్ ని దాటేసింది...

నిన్న షాహిద్, ఇప్పుడు అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్... బాలీవుడ్ హీరోలకు Yash వడదెబ్బ!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘రాకీ భాయ్’ రాకింగ్ పర్ఫామెన్స్ కొనసాగుతూనే ఉంది. మూడో వారంలోనూ స్ట్రెయిట్ హిందీ మూవీస్ ని ‘కేజీఎప్ చాప్టర్ 2’ పూర్తిగా డామినేట్ చేస్తోంది. తాజాగా యశ్ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ 350 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇటువంటి ఫీట్ చేసిన పదవ హిందీ సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. మరోవైపు, కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన అనంతర పరిస్థితుల్లో... 300 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ బాలీవుడ్ సినిమాగా కూడా ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ దూసుకుపోతోంది. యశ్ తో పాటూ శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ... హిందీ బెల్ట్ లో షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ చిత్రాల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 


ఈ వారం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకి అజయ్ దేవగణ్, టైగర్ ష్రాప్ చిత్రాలు ‘రన్ వే 34, హీరోపంతి 2’ వచ్చాయి. వాటి ఓపెనింగ్స్ పైన ‘కేజీఎఫ్ 2’ ఎఫెక్ట్ భారీగానే పడిందంటున్నారు బీ-టౌన్ అనలిస్టులు. గత శుక్రవారం కూడా ‘కేజీఎఫ్’ 4 కోట్లకు పైగా వసూలు చేయటంతో చాలా మంది ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ వీకెండ్ తో పాటూ రంజాన్ పండుగ సెలవు కూడా తోడయ్యే అవకాశం ఉండటంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింతగా కలెక్షన్ల వర్షం కురుస్తుందని అంచనాలు వేస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’తో పోటీ పడలేక గత వారం షాహిద్ కపూర్ ‘జెర్సీ’ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. ఈ వారం ‘రన్ వే 34, హీరోపంతి 2’ చిత్రాలకి కూడా ‘రాకీ భాయ్’తో రన్నింగ్ తప్పటం లేదు. చూడాలి మరి, ‘కేజీఎఫ్’ జోరు ఇంకెన్నాళ్లు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుందో... 

Updated Date - 2022-05-02T00:11:08+05:30 IST