వాళ్లతో మాట్లాడొద్దు.. అక్కడకు వెళ్లొద్దు.. Aryan Khan కు హైకోర్టు పెట్టిన కండీషన్ల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-10-30T00:39:10+05:30 IST

బెయిల్‌పై ఆర్యన్ ఖాన్‌కు హైకోర్టు 14షరతులు విధించింది. మరోవైపు ఆర్యన్‌ను త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు షారూక్‌ న్యాయవాదుల బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్ అరెస్టయిన విషయం తెలిసిందే.

వాళ్లతో మాట్లాడొద్దు.. అక్కడకు వెళ్లొద్దు.. Aryan Khan కు హైకోర్టు పెట్టిన కండీషన్ల లిస్ట్ ఇదీ..!

సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ముంబయి కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌కు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు బెయిలు మంజూరు చేయనున్నారు. బెయిల్‌పై ఆర్యన్ ఖాన్‌కు హైకోర్టు 14షరతులు విధించింది. మరోవైపు ఆర్యన్‌ను త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు షారూక్‌ న్యాయవాదుల బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వడానికి ముందు కోర్టు విధించిన షరతుల విషయానికి వస్తే..


ఆర్యన్‌కు విధించిన షరతులు..


సంబంధిత అధికారులకు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన పాస్‌పోర్టులను సరెండర్ చేయాల్సి ఉంటుంది.


లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ చెల్లించడంతో పాటూ ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలి.


ముంబయి దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి వివరాలతో కూడిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 


డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వారెవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. డ్రగ్స్ కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదు. 


కేసును పక్కదారి పట్టించే ఎలాంటి ప్రయత్నాలూ చేయరాదు. అలాగే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయొద్దు.


కేసు విచారణకు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు రావాల్సి ఉంటుంది. 


కేసుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ మీడియాకు ఇవ్వకూడదు. 


ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే బెయిల్ రద్దు చేసేలా సంబంధిత అధికారులు కోర్టుకు వెళ్లవచ్చు.


కేసు విచారణకు ఎలాంటి భంగం కలిగించవద్దు.

Updated Date - 2021-10-30T00:39:10+05:30 IST