The Godfather నటుడి మృతి

ABN , First Publish Date - 2022-07-09T01:07:34+05:30 IST

‘ద గాడ్ ఫాదర్’ (The Godfather)లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్(James Caan). ‘మిజరీ’ (Misery), ‘ఎల్ఫ్’ (Elf) వంటి చిత్రాలతో అభిమానులను

The Godfather నటుడి మృతి

‘ద గాడ్ ఫాదర్’ (The Godfather)లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్(James Caan). ‘మిజరీ’ (Misery), ‘ఎల్ఫ్’ (Elf) వంటి చిత్రాలతో అభిమానులను అలరించారు. ఈ ప్రఖ్యాత నటుడు తాజాగా మృతి చెందారు. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. జేమ్స్ మరణించిన విషయాన్ని ఆయన మెనేజర్ మాట్ డెల్పియానో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా జేమ్స్ కటుంబ సభ్యులకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. కానీ, జేమ్స్ మృతి చెందడానికి గల కారణాలను తెలపలేదు. అల్ పాచినో, రాబర్ట్ డి నీరో ఆయనకు నివాళులు అర్పించారు.  


జేమ్స్ కాన్ కెరీర్ ఆరంభంలో థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఇర్మా లా డౌస్’ (Irma la Douce) తో  సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అనేక హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ‘గాడ్ ఫాదర్’ లో సోని కార్లియోన్‌గా అభిమానులను మైమరిపించారు. నటనపరంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. ‘‘జేమ్స్ నాకు చిరకాల మిత్రుడు. ఆయన మనకు లేరనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన అద్భుతమైన నటుడు. బ్రిలియంట్ డైరెక్టర్’’ అని అల్ పాచినో చెప్పారు. ‘‘జేమ్స్ మరణ వార్తను వినడం విచారంగా ఉంది’’ అని రాబర్ట్ డి నీరో తెలిపారు. జేమ్స్ కాన్‌తో కలసి ఆడమ్ సాండ్లర్ (Adam Sandler) ‘బుల్లెట్ ఫ్రూఫ్’, ‘దట్స్ మై బాయ్’ సినిమాల్లో నటించారు. ఆయన మరణ వార్తను వినడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘జేమ్స్ కాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను ఎప్పటికి ఇష్టపడుతునే ఉంటాను. ఆయన పరిచయం కావడం నా అదృష్టం. జేమ్స్ పక్కన ఉన్నప్పుడు నవ్వడం ఎప్పుడు ఆపలేదు. ఆయన మరణవార్తను వినడం బాధాకరంగా ఉంది’’ అని ఆడమ్ సాండ్లర్ చెప్పారు. 



Updated Date - 2022-07-09T01:07:34+05:30 IST