క్లాస్‌గా తీసిన మాస్‌ సినిమా ది ఘోస్ట్‌

ABN , First Publish Date - 2022-10-02T07:08:43+05:30 IST

నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 5న విడుదల...

క్లాస్‌గా తీసిన మాస్‌ సినిమా ది ఘోస్ట్‌

నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఈ  చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 5న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ‘‘ఇంటిల్జెన్స్‌ వ్యవస్థలో జరిగే కథ ఇది. కథానాయకుడ్ని మాఫియా ‘ఘోస్ట్‌’ అని పిలుచుకొంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. నా కెరీర్‌లో ఓ హీరోని దృష్టిలో ఉంచుకొని కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన స్టయిల్‌, గ్రేస్‌ని దృష్టిలో ఉంచుకొని, అభిమానులు ఆయన్ని ఎలా చూడాలనుకొంటున్నారో.. అలాంటి పాత్రని డిజైన్‌ చేశాం. ఈ సినిమా కోసం కొన్ని ఆయుధాల్ని కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేశాం. యాక్షన్‌ దృశ్యాలకు పెద్ద పీట వేశాం. మొత్తం 12 ఫైట్లు ఈ సినిమాలో ఉన్నాయి. రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అభిమానులంతా విజిల్స్‌ వేస్తారు. ఓరకంగా చెప్పాలంటే క్లాస్‌గా తీసిన మాస్‌ సినిమా ఇది. సోనాల్‌ చౌహాన్‌ దగ్గర్నుంచి ప్రతీ ఆర్టిస్టునీ పాత్రకి తగినట్టే ఎంచుకొన్నాం. మా సినిమాతో పాటుగా ‘గాడ్‌ ఫాదర్‌’ విడుదల అవుతోంది. రెండూ విభిన్నమైన జోనర్‌ చిత్రాలు. కాబట్టి పోటీ అనుకోవడం లేదు. ‘ఘోస్ట్‌’ తరవాత వరుణ్‌తేజ్‌ తో ఓ సినిమా చేయబోతున్నా. ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించే ఆలోచన ఉంది’’ అన్నారు. 


Updated Date - 2022-10-02T07:08:43+05:30 IST