ఆ baby ఎలిఫెంట్ Puneeth Rajkumar ఫేవరెట్... అందుకే...

ABN , First Publish Date - 2021-11-13T23:27:02+05:30 IST

శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం షాక్ నుంచీ కర్ణాటక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆయన లేని లోటును అభిమానులకి ఎవరూ తీర్చలేరు. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ఉన్న పునీత్ సమాధి వద్దకు రోజు వేలాది మంది వస్తున్నారు. దివంగత నటుడ్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, కర్ణాటక అటవీ శాఖ అధికారులు కూడా...

ఆ baby ఎలిఫెంట్ Puneeth Rajkumar ఫేవరెట్... అందుకే...

శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం షాక్ నుంచీ కర్ణాటక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆయన లేని లోటును అభిమానులకి ఎవరూ తీర్చలేరు. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ఉన్న పునీత్ సమాధి వద్దకు రోజు వేలాది మంది వస్తున్నారు. దివంగత నటుడ్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, కర్ణాటక అటవీ శాఖ అధికారులు కూడా పునీత్ రాజ్‌కుమార్‌పై తమ అభిమానాన్ని తాజాగా చాటుకున్నారు...


కర్ణాటకలోని సక్రేబెయిలు ప్రాంతంలో ఓ ఎలిఫెంట్ క్యాంప్‌ ఉంది. తన అకాల మరణానికి కొద్ది రోజుల ముందు పునీత్ రాజ్‌కుమార్ ఆ శిబిరాన్ని సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటూ అక్కడి గజరాజుల మధ్య సరదాగా గడిపారు. ముఖ్యంగా, ఓ రెండేళ్ల మగ ఏనుగు పిల్లతో ఆయన అనుబంధం పెంచుకున్నారట. అది ఆయన ఫేవరెట్ బేబీ ఎలిఫెంట్‌గా మారిందట. అందుకే, సదరు క్యూట్ ఎలిఫెంట్‌కి ‘పునీత్ రాజ్‌కుమార్’ పేరే పెట్టారట! దివంగత స్టార్ హీరో జ్ఞాపకార్థం ఇకపై దాన్ని ‘పునీత్’గా పిలుస్తామంటున్నారు స్థానిక అధికారులు... 

Updated Date - 2021-11-13T23:27:02+05:30 IST