‘83’ MOVIE : దీపికా పదుకొణేపై కేసు

ABN , First Publish Date - 2021-12-10T20:27:41+05:30 IST

రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘83’. టీమిండియా 1983లో సాధించిన తొలి ప్రపంచ కప్ విజయం నేపథ్యంలో డైరెక్టర్ కబీర్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. రణవీర్ అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్‌గా అలరించనున్నాడు.

‘83’ MOVIE : దీపికా పదుకొణేపై కేసు

రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘83’.  టీమిండియా 1983లో సాధించిన తొలి ప్రపంచ కప్ విజయం నేపథ్యంలో డైరెక్టర్ కబీర్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. రణవీర్ అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్‌గా అలరించనున్నాడు. ‘83’ సినిమా డిసెంబర్ 24న క్రిస్మిస్ వేళ విడుదలవుతోంది. అయితే, అంతా సాఫీగా సాగుతోన్న సమయంలో హీరోయిన్ దీపికపై కేసు పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెతో పాటూ సినిమా నిర్మాతల్ని కూడా కోర్టుకు ఈడుస్తానంటున్నాడు యూఏఈ దేశానికి చెందిన ఓ ఫైనాన్సియర్... 


‘83’ సినిమా నిర్మాతల్లో దీపికా కూడా ఒకరు. అందుకే, యూఏఈకి చెందిన ఓ ఫైనాన్సియర్ ముంబైలోని ఒక కోర్టులో ఆమె మీద కేసు నమోదు చేశాడు. ‘83’ ప్రొడ్యూసర్స్ తన కంపెనీ నుంచీ 16 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకున్నారని ఆయన అంటున్నాడు. తరువాత లాభాల్లో తగినంత వాటా ఇస్తామని వారు మాటిచ్చారట. కానీ, తన డబ్బుని అనేక ఇతర అగ్రిమెంట్స్ ద్వారా ‘83’ నిర్మాణానికి వాడుకున్నారని ఫైనాన్సియర్ ఆరోపిస్తున్నాడు. అయితే, ఇంత వరకూ తన నుంచీ తీసుకున్న డబ్బులపై ఎటువంటి ప్రాఫిట్ ఇవ్వలేదంటున్నాడు యూఏఈ బిజినెస్‌మ్యాన్. చూడాలి మరి, దీపికతో సహా ‘83’ సినిమా నిర్మాతలపై నమోదైన కేసు విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో... 

Updated Date - 2021-12-10T20:27:41+05:30 IST