సల్మాన్ ఖాన్ ఇంజక్షన్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

ABN , First Publish Date - 2022-03-24T23:07:05+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్.

సల్మాన్ ఖాన్ ఇంజక్షన్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. అతడు వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘టైగర్-3’, ‘కబీ ఈద్ కబీ దివాళీ’, ‘పవన్ పుత్ర భాయిజాన్’ సినిమాలు ప్రస్తుతం అతడి చేతిలో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడికి కోర్టులో చుక్కుదురైంది. కేసు వివరాల్లోకి వెళ్లితే..


సల్మాన్‌ఖాన్‌‌కు ముంబై‌లోని పన్వేల్‌లో ఫాంహౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫాంహౌస్ పక్కనే ఉన్న స్థలాన్ని ఖేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి 1996లోనే కొనుగోలు చేశారు. ఖేతన్, సల్మాన్‌కు అనేక ఏళ్లుగా భూమి విషయంలో తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. భూ తగదాల నేపథ్యంలో ఖేతన్ పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ..సల్మాన్ పైనా, అతడి ఫాంహౌస్‌పైనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై సల్మాన్ ఖాన్ గతంలోనే పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే, ఖేతన్ వెనక్కి తగ్గకుండా సల్లూ‌బాయ్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయకుండా ఖేతన్‌ను అడ్డుకోవాలని సల్మాన్ ఇంజక్షన్ పిటిషన్ వేశారు. అలాగే.. ఈ వైరల్ వీడియోలన్నింటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని భాయిజాన్ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసం సల్మాన్ ఇంజక్షన్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-03-24T23:07:05+05:30 IST