ప్రేక్షకుల విజిల్స్‌ కిక్‌ ఇచ్చాయి

ABN , First Publish Date - 2022-08-14T06:17:07+05:30 IST

‘‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో నా కెరీర్‌లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లను అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు....

ప్రేక్షకుల విజిల్స్‌ కిక్‌ ఇచ్చాయి

‘‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో నా కెరీర్‌లోనే అత్యధిక తొలిరోజు వసూళ్లను అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని అద్భుతంగా ఆదరించారు. ప్రేక్షుకల మధ్యన సినిమా చూశాను. వారి విజిల్స్‌ మంచి కిక్‌ ఇచ్చాయి’’ అని  నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకాధరణ  పొందుతోన్న సందర్భంగా శనివారం చిత్రయూనిట్‌ సక్సె్‌సమీట్‌ నిర్వహించింది. కృతిశెట్టి మాట్లాడుతూ ‘తొలి రోజు రూ. 10 కోట్ల వసూళ్లంటే మామూలు విషయం కాదు. ‘మాచర్ల...’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. కుటుంబంతో కలసి చూడండి’ అని ప్రేక్షకులను కోరారు. చిత్ర నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ ‘కరోనా తర్వాత ఈ స్థాయి వసూళ్లు రావడం ఆనందంగా ఉంద’న్నారు. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఎంజాయ్‌ చేస్తున్నారు అని రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. 


Updated Date - 2022-08-14T06:17:07+05:30 IST