స్టేట్ ఫిలిం అవార్డ్స్‌ను ప్రకటించిన కేరళ.. ఉత్తమ నటిగా Revathi

ABN , First Publish Date - 2022-05-28T01:49:40+05:30 IST

కేరళ ప్రభుత్వం 52వ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ప్రకటించింది. ఉత్తమ నటులుగా జోజు జార్జ్(Joju George), బిజు మీనన్ (Biju Menon) అవార్డులు గెలుచుకున్నారు. ‘నాయట్టు’(Nayattu), ‘మధురం’, ‘తురముఖం’,

స్టేట్ ఫిలిం అవార్డ్స్‌ను ప్రకటించిన కేరళ.. ఉత్తమ నటిగా Revathi

కేరళ ప్రభుత్వం 52వ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ప్రకటించింది. ఉత్తమ నటులుగా జోజు జార్జ్(Joju George), బిజు మీనన్ (Biju Menon) అవార్డులు గెలుచుకున్నారు. ‘నాయట్టు’(Nayattu), ‘మధురం’, ‘తురముఖం’, ‘ఫ్రీడం ఫైట్’ సినిమాల్లోని నటనకు గాను జోజు, ‘అర్కారియమ్’ సినిమాలోని పర్‌ఫార్మెన్స్‌కు గాను బిజు మీనన్ ఉత్తమ నటులగా అవార్డులను గెలుపొందారు. ‘భూతకాలం’ సినిమాలో నటించినందుకు రేవతి(Revathi) ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుపొందింది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘హృదయం’ పాపులర్ మలయాళం సినిమా అవార్డును గెలుచుకుంది.


గతేడాది స్టేట్ ఫిలిం అవార్డ్స్ కోసం 80 చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, ఈ ఏడాది జ్యూరీ 142 సినిమాలను అవార్డు కోసం పరిగణించింది. చివరగా 29 సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్‌తో మోహన్ లాల్, తన తండ్రి మమ్ముట్టితో దుల్కర్ సల్మాన్ పోటీపడ్డారు.   


కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్: 


బెస్ట్ డైరెక్టర్ - దిలీష్ పోతేన్ (జోజి)


బెస్ట్ యాక్టర్ - బిజు మీనన్(అర్కారియమ్), జోజు జార్జ్(నాయట్టు, మధురం, ఫ్రీడం ఫైట్)


బెస్ట్ యాక్ట్రెస్ - రేవతి (భూతకాలం)


బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ - ఉన్నిమయ ప్రసాద్(జోజి)


బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - మధు నీలకందన్ (చురులి)


బెస్ట్ స్టోరీ రైటర్ - షాహి కబీర్ (నాయట్టు)


బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - మిన్నల్ మురళి (అండ్రూస్)


బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - కృష్ణేందు కాలేష్


బెస్ట్ పాపులర్ మూవీ - హృదయం


బెస్ట్ కొరియోగ్రఫీ - అరుల్ రాజ్


బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ -ఎస్. దేవి


బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జె. మెల్వీ (మిన్నల్ మురళి) 


బెస్ట్ మేకప్ - రంజిత్ అంబటి (అర్కారియమ్)


బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - జస్టిన్ జోస్ (మిన్నల్ మురళి)


బెస్ట్ సింక్ సౌండ్ - అరుణ్ అశోక్, సోనూ కేపీ 


బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - ఏవీ గోకుల్‌దాస్


బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ -సితార కృష్ణ కుమార్


బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ -హిషామ్ అబ్దుల్ వహాబ్


బెస్ట్ లిరిసిస్ట్ - బికె. హరినారాయణన్


బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- శ్యామ్ పుష్కరన్

Updated Date - 2022-05-28T01:49:40+05:30 IST