Thank you: ఏపీలో ప్రీమియర్స్..

ABN , First Publish Date - 2022-07-21T18:54:50+05:30 IST

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ (Thankyou). మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Thank you: ఏపీలో ప్రీమియర్స్..

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ (Thankyou). మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశి ఖన్నా (Rashi Khanna) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ సక్సెస్‌పై మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, థ్యాంక్యూ మూవీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసింది చిత్రబృందం.


వైజాగ్, విజయవాడ, భీమవరం, రాజమండ్రి అలాగే, నెల్లూరులో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఆయా నగరాల్లో అక్కినేని అభిమానులు సినిమా చూసేందుకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈరోజు రాత్రి 09:30 గంటలకు స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. ఇక థ్యాంక్యూ మూవీలో సాయి సుశాంత్ రెడ్డి, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఎస్ సంగీతం అందించారు. 


గతకొంతకాలంగా దర్శకుడు విక్రమ్ కుమార్ కి సరైన సక్సెస్ లేదు. దాంతో ఈ మూవీ సక్సెస్ ఆయనకు చాలా కీలకం. ఇక నాగ చైతన్య ఈ ఏడాది 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' చిత్రాలతో వచ్చి వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఇప్పుడు 'థాంక్యూ' సినిమాతోనూ మంచి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. చుడాలి మరి చైతుకి ఈ మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో. 

Updated Date - 2022-07-21T18:54:50+05:30 IST